దశావతారం చిత్రంతో సంచలనం సృష్టించిన పద్మభూషణ్ కమల్ హాసన్ ఈనాడు టైటిల్ తో ఓ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్, వెంకటేష్ కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రం షూటింగ్ ఫిలింసిటీలో లాంఛనంగా ప్రారంభం అయింది. హిందీలో ఘనవిజయం సాధించిన వెడ్‌నెస్ డే' చిత్రామే తెలుగులో 'ఈనాడు' గా రీమేక్ అవుతోంది. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్ కమల్ బేనర్‌లో ముంబై యుటివి స్టూడియోస్ తో కలిపి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'సాగర సంగమం'లో నటించిన చక్రి ఈ చిత్రానికి దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు. హిందీలో అనుపమ్ ఖేర్ పోషించిన పోలీసాఫీసర్ పాత్రను వెంకటేష్ తెలుగు వెర్షన్‌లో పోషిస్తుండగా తమిళంలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ పోషిస్తున్నారు. కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకురాలుగా పరిచయం కాబోతుంది. అప్పట్లో ఈనాడు పేరుతో కృష్ణ హీరోగా ఓ చిత్రం వచ్చి హిట్టయింది.