twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ 'ఈనాడు' ఎప్పుడంటే...

    By Staff
    |

    కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఈనాడు' చిత్రం ఆగస్టు పన్నెండున రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ ఎ వెడ్నస్ డే కి రీమేక్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని చక్రి అనే నూతన దర్శకుడు డైరక్ట్ చేస్తున్నాడు. చక్రి అంటే మరెవరో కాదు సాగరసంగమం చిత్రంలో భంగిమ కుర్రాడు. ఇక ఈ చిత్రం తెలుగు వెర్షన్ ఈనాడులో కమల్ తో పాటు వెంకటేష్ కూడా నటిస్తారు. అదే తమిళ, మళయాల వెర్షన్స్ కి మోహన్ లాల్..వెంకటేష్ ప్లేస్ లో చేస్తున్నారు. యూటీవీ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. నీలకంఠ కూడా ఈ చిత్రం తెలుగు వెర్షన్ కి రచన చేస్తున్నారు. ఇక ఈ చిత్రం అనంతరం వెంకటేష్ తన తదుపరి చిత్రమైన శ్రీను వైట్ల 'నమోవెంకటేశ' కి షూటింగ్ కి యూరప్ వెళ్ళిపోతారు. జూలై 26 నుండి ఇరవై ఐదు రోజులపాటు కంటెన్యూ షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేసారు. అలాగే మరో మాస్ ఎంటర్టైనర్ ని అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో చేయటానికి వెంకటేష్ కమిటయ్యారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X