Kamal Haasan: సినీ నటుడు కమల్ హాసన్ కు అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్!

యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. 50 ఏళ్లకుపైగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన వర్సటైల్ హీరో కమల్ హాసన్. ఇప్పటివరకు కమల్ హాసన్ సుమారు 200కు పైగా సినిమాల్లో నటించారు. ఇక ఇటీవల నటించన విక్రమ్ మూవీ ఎంతటి ఘన విజయాన్ని అందుకుంది.

సుమారు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ కు కమ్ బ్యాక్ ఇచ్చిన మూవీ ఇది. ఈ సినిమా తర్వాత కమల్ హాసన్ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నాడు. వెనువెంటనే పలు చిత్రాలను లైన్ లో పెట్టిన ఈ లోకనాయకుడు తాజాగా హాస్పిటల్ లో చేరారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మణిరత్నంతో రెండోసారి..

మణిరత్నంతో రెండోసారి..

లోక నాయకుడు కమల్ హాసన్ గురించి ఎంత చెప్పిన తక్కువే. విభిన్నమైన సినిమాలతోపాటు విభిన్నమైన రోల్స్ చేస్తూ ఆద్యంతం సినీ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథానాయకుడు. ఇప్పటివరకు సుమారు 200కు పైగా సినిమాల్లో నటించిన ఆయన ఇటీవల విక్రమ్ మూవీతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.

ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుస పెట్టి సినిమాలు లైన్ లో పెట్టారు. ఇప్పటికే భారతీయుడు 2 సినిమా చిత్రీకరణ జరుగుతోంది. అలాగే 35 ఏళ్ల తర్వాత మరోసారి లెజండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ 234వ సినిమాను చేయనున్నారు. ఈ మూవీ 2024లో రానుందని సమాచారం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది..

వరుస పెట్టి సినిమాలతో దూసుకుపోతున్న ఉలగ నాయగన్ (లోకనాయకుడు), మక్కల్ నీధి మయం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో చెన్నైలోని పోరూర్ రామచంద్ర హాస్పిటల్ లో నవంబర్ 23న చేరారు. ఆయనకు జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు.

అయితే ఆయన రెగ్యులర్ చెకప్ కోసమే హాస్పిటల్ కు వచ్చారని వైద్యులు తెలిపినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఆయన్ను కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారట. కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరిన తర్వాతి రోజే అంటే ఇవాళ ఇప్పటికే డిస్చార్జ్ అయినట్లు సమాచారం.

గురువు వద్ద ఆశీర్వాదం..

గురువు వద్ద ఆశీర్వాదం..

కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరడానికి ముందు ఆయన గురువు, డైరెక్టర్ కళా తపస్వీ కె. విశ్వనాథ్ ను హైదరాబాద్ లో కలిశారు. హైదరాబాద్ లో కె. విశ్వనాథ్ ను కలిసిన కమల్ హాసన్ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కమల్ హాసన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలియగానే ఆయన అభిమానులు ఆందోళకు గురయ్యారు. కానీ ప్రస్తుతం కమల్ హాసన్ ఆరోగ్యం బాగున్నట్లు వైద్యులు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X