కమల్ హాసన్ ‘టిప్పు సుల్తాన్’(ఫస్ట్ లుక్)
హైదరాబాద్: వినూత్న సినిమాలకు, వైవిద్యమైన పాత్రలకు పెట్టింది పేరైన ప్రముఖ నటుడు కమల్ హాసన్ త్వరలో ‘టిప్పు సుల్తాన్' సినిమా చేయబోతున్నాడు. మైసూర్ కింగ్ టిప్పు సుల్తాన్ జీవితం ఆధారంగా ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించబోతున్నారు.

ప్రస్తుతం కమల్ హాసన్ ‘విశ్వరూపం-2' చిత్రానికి తుది మెరుగులు దిద్దే ప్రయత్నంలో ఉన్నారు. సూపర్ హిట్ మూవీ ‘విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ చిత్రం పూర్తయిన తర్వాత ‘టిప్పు సుల్తాన్' చిత్రం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
దీంతో పాటు కమల్ హాసన్ మరో రెండు సినిమాలను విడుదల చేయబోతున్నారు. అందులో ఒకటి ‘ఉత్తమ విలన్' చిత్రం కాగా, మరొకటి ‘పాప నాశనం'.


Click it and Unblock the Notifications











