twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    భారతీయుడు 2 సెట్‌లో ప్రమాదం.. కోటి విరాళం ప్రకటించిన కమల్

    |

    యూనివర్సల్ హీరో కమల్ హాసన్, భారతీయ చలన చిత్రం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ (భారతీయుడు) సినిమా ఎంతటి సంచలనాలు నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మళ్లీ ఆ చిత్రానికి సీక్వెల్ చేయాలని భావించిన ఈ ద్వయం గతేడాది ఇండియన్ 2ను పట్టాలెక్కించింది. అయితే ఏ ముహూర్తాన వీరు ఆ చిత్రాన్ని మొదలు పెట్టారో గానీ ఆటంకాలు ఎదురువుతూనే ఉన్నాయి. తాజాగా ఈ మూవీ షూటింగ్‌ సెట్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

     చెన్నైలో షూటింగ్

    చెన్నైలో షూటింగ్

    ప్రస్తుతం భారతీయుడు 2 సినిమా షూటింగ్‌ చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో జరుగుతోంది. ఈ మేరకు లైటింగ్ కోసం భారీ క్రేన్స్ సహాయంతో సెట్‌ను డిజైన్ చేస్తున్నారు. ఈ క్రమంలో 150 అడుగుల ఎత్తు నుంచి క్రేన్ తెగి కింద పడటంతో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.

    ముగ్గురు వ్యక్తులు దుర్మరణం..

    ముగ్గురు వ్యక్తులు దుర్మరణం..

    ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. దాదాపు పదిమంది తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఓ లైట్‌బాయ్ ఉన్నారని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. డైరెక్టర్ శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు (29), అసిస్టెంట్ డైరెక్టర్ సాయి కృష్ణ (34), మరో సహాయకుడు చంద్రన్ మృతి చెందినట్లు ప్రెస్ నోట్ విడుదల చేసింది.

    ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలీవుడ్

    ఉలిక్కిపడ్డ టాలీవుడ్, కోలీవుడ్

    ఈ ఘటనకు సంబంధించిన వార్త తెలియగానే.. అటు కోలీవుడ్ ఇటు టాలీవుడ్ ఉలిక్కిపడ్డాయి. కేవలం తమిళ నటులే కాదు.. తెలుగు సినీ ప్రముఖులు సైతం ఈ ఘటనపై తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, ధనుష్ వంటి వారు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.

    కోటి విరాళం ప్రకటించిన కమల్..

    కోటి విరాళం ప్రకటించిన కమల్..

    ఈ ఘటనలో మృతి చెందిన కుటుంబాలకు కమల్ హాసన్ కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ ఘటనతో షాక్ తిన్న చిత్రయూనిట్ కొన్ని రోజుల పాటు షూటింగ్‌ను వాయిదా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

    English summary
    Kamal Haasan Announced One Crore Donation, Who Died In Accident On Indian 2 set. Last night Major accident occured in Bharatheeyudu 2 shooting. In this Accident three people had died and ten people including director Shankar injured.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X