Don't Miss!
- News హైదరాబాద్, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే: ఖమ్మంలో హీరో వెంకటేష్ వియ్యంకుడు
- Sports T20 World Cup 2024 బ్రాండ్ అంబాసిడర్‌గా పరుగుల చిరుత.!
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
నేను మీ ఆయుధం, పోరాటం మొదలు పెడదాం: విశ్వరూపం 2 వేడుకలో కమల్ హాసన్ భావోద్వేగం!
కమల్ హాసన్ కథానాయకుడిగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం విశ్వరూపం 2. గతంలో వచ్చిన 'విశ్వరూపం' కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. పూజా కుమార్, ఆండ్రియా కథానాయికలు. ఆగస్టు 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకొస్తోంది. జిబ్రాన్ సంగీతం అందించారు. తెలుగు వెర్షన్ ఆడియో వేడుక గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకలో కమల్ హాసన్ భావోద్వేగంగా స్పందించారు. సినిమా నటుడిగా తనను ఆదరించిన మీరంతా తన రాజకీయ ప్రయాణంలో తోడ్పాడు అందించాలని కోరారు.
నేను భారతీయుడిని
నాకున్న పాషన్‌కు కారణం ప్రేక్షకులు నాపై చూపుతున్న ప్రేమ. నేను సినిమాలకు తీసుకునే రెమ్యూనరేషన్ ఖర్చు పెడితే అయిపోతుంది. కానీ మీరు నాపై చూపే ప్రేమ ఎప్పటికీ అలాగే ఉండి పోతుంది. నేను స్టేట్లెస్ ఆర్టిస్ట్ అని సంతోషంగా చెప్పుకుంటాను. నేను తెలుగు వాడిని, మలయాళీని, నేను భారతీయుడిని అని గర్వంగా చెప్పుకుంటాను. మీరంతా నాపై ఎనలేని ప్రేమ చూపించడం వల్లే నేను ఇలా చెప్పుకోవడం సాధ్యమైంది.... అని కమల్ హాసన్ అన్నారు.
మీ ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి
నాకన్నా పెద్దవారు ఆశీర్వదించారు, నాకన్నా చిన్నవారు నాపై ప్రేమ చూపించారు. మీరు కొట్టే చప్పట్లు ఇంకా నా చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి. మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే ఈ స్థాయికి వచ్చాను.
ఇదంతా నా అదృష్టం
తెలుగు సినిమాతో నాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. నేను చేసిన తెలుగు సినిమాలు నన్ను ఎంతో పైకి తీసుకెళ్లాయి. ఇది నా టాలెంటు వల్ల జరిగింది కాదు... తెలుగు నేను చేయడం వల్ల అదృష్టం కలిసొచ్చి ఇదంతా సాధ్యమైంది అని కమల్ హాసన్ తెలిపారు.
ఏ మాత్రం నిరాశ పరచదు
విశ్వరూపం చిత్రాన్ని మీరెంతో ఆదరించారు. నా దృష్టిలో ఇది ఒకే సినిమా. కానీ మీకు రెండు పార్టులుగా ఇస్తున్నాం. మీరు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారు అనే నమ్మకంతో చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం మీరు కూడా చాలా వెయిట్ చేశారు. మిమ్మల్ని ఏ మాత్రం నిరాశ పరచదు అని నమ్మకంగా చెబుతున్నాం.
మరో చరిత్ర స్థాయిలో
సినిమా మ్యూజిక్ అద్భుతంగా, యాక్షన్ సీన్లు అద్భుతం... విశ్వరూపం 1 కంటే ఇంకా బాగా చేశామని అనుకుంటున్నాం. నిర్ణయం మీదే... ఆగస్టు 10న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మరో చరిత్ర స్థాయిలో ఇది విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది.
నేను మీ ఆయుధం
60 ఏళ్లుగా నన్ను ఆదరిస్తున్నారు. మీ వల్ల ఎంతో పేరు, డబ్బు సంపాదించాను. ఇపుడు నేను అనుభవిస్తున్నవన్నీ మీరు ఆదరించడం వల్ల వచ్చినవే. మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను మీరు తయారు చేసిన ఆయుధాన్ని అంటూ.... తన రాజకీయ ప్రవేశం గురించి ప్రస్తావించారు కమల్.
మరో సత్యాగ్రహంలో మీరు భాగస్వాములు కావాలి
71 ఏళ్ల స్వాంతంత్రం తర్వాత ఇండియాలో మరో సత్యాగ్రహం మొదలు కాబోతోంది. మీరు అందులో భాగం కావాలి. ఇది కేవలం నేను మొదలు పెట్టిన ఒక రాష్ట్రానికి పరిమితం కాదు. నా లక్ష్యం ఈ దేశం. నిర్లక్ష్యం, స్వేచ్ఛ లేక పోవడం అనేది చాలా ప్రమాదకరం. 71 ఏళ్లుగా మనం నిర్లక్ష్యం చేయబడుతూనే ఉన్నాం. అందుకే మరోసారి మనం ఫ్రీడమ్ స్ట్రగుల్ మళ్లీ మొదలు పెట్టాలి అని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.