మీ వల్లనే తిండి.. బట్ట.. రుణం తీర్చుకొంటా.. ఆయుధంగా మారాను.. కమల్

By Rajababu

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ నటిస్తూ, దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం' సంచలన విజయాన్ని సాధించిన విషయం తెల్సిందే. ఆ చిత్రానికి సీక్వెల్‌గా వస్తోన్న 'విశ్వరూపం-2' చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్నంత క్యూరియాసిటీ ఆడియన్స్‌లో నెలకొని ఉంది. ఆండ్రియా, పూజా కుమార్‌ హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి జిబ్రాన్‌ మ్యూజిక్‌ని అందించారు. ఆస్కార్‌ ఫిలిం ప్రై. లిమిటెడ్‌ వి. రవిచంద్రన్‌ బేనర్‌పై రాజ్‌ కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పణలో ఎస్‌. చంద్రహాసన్‌, కమల్‌హాసన్‌ నిర్మించిన 'విశ్వరూపం-2' చిత్రం ఆగస్ట్‌ 10న వరల్డ్‌వైడ్‌గా విడుదల అవుతున్నది.

ఘనంగా విశ్వరూపం ఆడియో

ఘనంగా విశ్వరూపం ఆడియో

విశ్వరూపం2 చిత్రం ఆడియో రిలీజ్‌ కార్యక్రమం ఆగస్ట్‌ 2న హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌, హీరోయిన్స్‌ ఆండ్రియా, పూజా కుమార్‌, సంగీత దర్శకుడు జిబ్రాన్‌, పాటల రచయిత రామజోగయ్య శాస్త్రి, ఎ.పి. ఫిల్మ్‌ చాంబర్‌ ప్రెసిడెండ్‌ వీరినాయుడు, తెలుగు ఫిలిం చాంబర్‌ కార్యదర్శి ముత్యాల రామదాసు, ప్రముఖ నిర్మాత ఠాగూర్‌ మధు, ఏషియన్‌ ఫిలింస్‌ అధినేత నారాయణ్‌ దాస్‌, టి.ఎమ్‌.టి. ఎండి సుమన్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం 'విశ్వరూపం-2' ఆడియో సీడిలను యూనివర్శల్‌ స్టార్‌ కమల్‌హాసన్‌ రిలీజ్‌ చేశారు. లహరి మ్యూజిక్‌ ద్వారా ఆడియో విడుదలైంది.

భారతీయుడిని అని గర్వంగా

భారతీయుడిని అని గర్వంగా

యూనివర్శల్‌ హీరో కమల్‌హాసన్‌ మాట్లాడుతూ - ''నన్ను స్టార్‌గానే కాదు.. నాకున్న ప్యాషన్‌ ఇంకా కొనసాగుతుందంటే అందుకు తెలుగు ప్రేక్షకుల ప్రేమే కారణం. నేను తెలుగు వాడిని, మలయాళం వాడిని అనే కంటే.. నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి ఎప్పుడూ గర్వపడతాను. అది ప్రేక్షకులు, అభిమానుల పంచిన ప్రేమ కారణంగానే సాధ్యమైంది. నాకన్నా పెద్దవాళ్లు నన్ను ఆశీర్వదిస్తే.. నాకన్నా చిన్నవాళ్లు ప్రేమను చూపించారు. నన్ను నటన పరంగా అత్యున్నత స్థితికి తీసుకెళ్లిన సినిమాలన్నీ తెలుగు సినిమాలే. అది టాలెంట్‌ అనడం కంటే అద‌ృష్టం అని చెప్పాలి.

 ఆగస్టు 10 కోసం

ఆగస్టు 10 కోసం

విశ్వరూపం మాదృష్టిలో ఒకే సినిమా. రెండు భాగాలు విడుదల చేస్తున్నాం. హార్డ్‌వర్క్‌ను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ అప్రిషియేట్‌ చేస్తారనే నమ్మకంతో చేసిన సినిమా. 'విశ్వరూపం' పార్ట్‌1 కంటే ఇంకా బెటర్‌గా పార్ట్‌ 2ను చేశాం. ఆగస్ట్‌ 10 కోసం ఆతృతగా వేచి చేస్తున్నాం. ప్రేక్షకులు అందించిన అభిమానంతో మరో కోణంలో కనిపిస్తాను.

రుణం తీర్చుకోవాలని

రుణం తీర్చుకోవాలని

సినిమా ద్వారా మీరు చూపించిన ప్రేమకు మీ రుణం తీర్చుకోవాలనుకుంటున్నాను. నేను తినేది, వేసుకునే దుస్తులు.. అన్నీ ప్రేక్షకులు ఇచ్చినవే. అందరూ కలిసి నాపై పెట్టుబడి పెట్టారు. మీ ప్రొడక్ట్‌ అయిన నేను ఇప్పుడు ఆయుధంగా మారాను. మీరు తప్పకుండా ఉపయోగించుకోండి. మన ఫ్రీడమ్‌ కోసం మళ్లీ మనం పోరాడాల్సిన తరుణం వచ్చింది'' అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X