MH370 మిస్సింగ్ మిస్టరీపై కమల్ హాసన్ మూవీ?
హైదరాబాద్: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ త్వరలో ‘ఉత్తమ విలన్' చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్టు ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ‘పాపనాశనం', ‘విశ్వరూపం 2' చిత్రాల్లోనూ ఆయన నటిస్తున్నారు.
తాజాగా కమల్ హాసన్ చేయబోయే సినిమాల లిస్టులో మరొకటి చేరినట్లు తెలుస్తోంది. ఆ మధ్య మిస్సయిన MH370 అనే మలేషియాన్ ఎయిర్ లైన్స్ విమానం మిస్టరీపై కమల్ హాసన్ సినిమా తీయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రభుదేవా దర్శకత్వం వహించే అవకాశం ఉంది. రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్లో స్వయంగా కమల్ హాసనే ఈ చిత్రం నిర్మిస్తారని అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మలేషియా ఎయిర్ లైన్స్ కు సంబంధించిన MH370 అనే విమానం మార్చి 8, 2014న కౌలాలంపూర్ నుండి బీజింగ్ వెలుతూ అదృశ్యం అయింది. ఇప్పటి వరకు ఈ విమానం ఆచూకి తెలియలేదు. వివిధ దేశాలు ఈ విమానం ఆచూకీ కోసం వందల కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండా పోయింది.
ఈ సంఘటనను బేస్ చేసుకుని ఆసక్తికరంగా, ప్రేక్షకుల్లో ఉత్కంఠ రేపేలా స్క్రిప్టు డెవలప్ చేసారని అంటున్నారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అఫీషియల్ గా వెల్లడి కానున్నాయి. అయితే ఈ చిత్రానికి ముగింపు కూడా ఆసక్తి కంగా ఉంటుందని. వైవిద్యానికి పెట్టింది పేరైన కమల్ హాసన్ ఈ చిత్రంలో ఎలా కనిపించబోతున్నారనే విషయం తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











