‘మనం’ మూవీ చూసి ఏడ్చిన కమల్ హాసన్
హైదరాబాద్ం అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో శ్రీమతి అన్నపూర్ణ ఆశీస్సులతో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబం నిర్మించిన 'మనం' మే 23న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై భారీ ఓపెనింగ్స్‌తో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన 'ప్రేమాభిషేకం' చిత్రంలా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఓవర్సీస్ లో ఒక మిలియన్ డాలర్స్ పైగా కలెక్ట్ చేసికొత్త రికార్డు సృష్టించింది. అలాగే తెలంగాణ, ఆంధ్రా సీడెడ్‌లో అక్కినేని హీరోల చిత్రాల్లో కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ప్రేక్షకుల ఆదరణతో పాటు, ప్రముఖుల ప్రశంసలు కూడా ఈ చిత్రానకి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ నటుడు కమల్ హాసన్ 'మనం' చిత్రాన్ని చూసి ఈ విధంగా స్పందించారు. 'మనం చిత్రం చూసిన తర్వాత ఏఎన్ఆర్ గారి అభిమానిగా మారిపోయాను. ఇది మా సినిమా అనే ఫీలింగ్ కలిగించిన చిత్రం 'మనం'. ఇది ఒక ఫీల్ గుడ్ మూవీ. ఈ సినిమాలో అందరూ నవ్వుతున్నపుడు ఏఎన్ఆర్ గారితో నాకు ఉన్న అనుబంధం గుర్తొచ్చి చాలా ఏడుపొచ్చింది. వారి కుటుంబం ఈ చిత్రాన్ని నిజంగా ఒక అందమైన చివరి మాటలా తీర్చిదిద్దినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఏఎన్ఆర్ గారు 'మనం'లో, నాగార్జునలో, నాగ చైతన్యలో, నాలో ఇంకా జీవించే ఉన్నారు. ఇంత గొప్ప సినిమా తీసే ఆలోచన చేసినందుకు ఏఎన్ఆర్ అభిమానిగా వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను' అన్నారు.


Click it and Unblock the Notifications











