సల్మాన్ షోలో కమల్ హాసన్.. ఇద్దరు బిగ్‌బాస్‌లు ఒకేచోట..
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న దస్ కా దమ్ అనే షోలో విలక్షణ నటుడు కమల్ హాసన్ ప్రత్యక్ష్యమయ్యాడు. ఈ కార్యక్రమంలో విశ్వరూపం2 హీరోయిన్‌తో కలిసి కమల్ పాల్గొన్నారు. విశ్వరూపం సినిమా ప్రమోషన్‌కు వెళ్లిన కమల్‌ను సల్మాన్ సాదరంగా ఆహ్వానించారు. ఆ ఫోటోలను కమల్ తన ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశారు.

సొదరుడు అంటే సల్మాన్ ఖాన్‌లా
సోదరుడు అంటే సల్మాన్ ఖాన్‌లా ఉండాలి. చాలా రోజుల తర్వాత మిమ్మల్ని కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని కమల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

బిగ్‌బాస్‌లతో ఫ్యాన్స్ ఫిదా
బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సల్మాన్, కమల్‌ను చూడగానే ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. హిందీలో బిగ్‌బాస్‌కు సల్మాన్, తమిళంలో కమల్ హాసన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

విశ్వరూపానికి సీక్వెల్
ఇక విశ్వరూపం2 సినిమా విషయానికి వస్తే 2013లో విడుదలైన విశ్వరూపం చిత్రానికి ఇది సీక్వెల్. అఫ్ఘనిస్థాన్‌ను ఆధారంగా చేసుకొని ఒమర్ అనే ఉగ్రవాది నిర్వహించే కార్యకలాపాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో కమల్ రా ఏజెంట్‌గా నటించారు.

ఆగస్టు 10న విశ్వరూపం2 రిలీజ్
విశ్వరూపం2 సినిమా 2015లోనే రావాల్సి ఉంది. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఆగస్టు 10న రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రంలో పూజాకుమార్, అండ్రియా జెర్మియా, శేఖర్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు.


Click it and Unblock the Notifications











