నన్ను చంపడానికి ప్రయత్నించండి: పిల్లలు చేసిన దారుణంపై కమల్ ఆవేదన (వీడియో)
హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందంటూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఇద్దరు చిన్నారులు కమల్ పోస్టర్ ను కత్తులతో పొడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది
కొద్ది రోజుల క్రితం కమల్....దేశంలో హిందూ ఉగ్రవాదం పెరిగిపోతోందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఆ వ్యాఖ్యలకు నిరసనగా కమల్ పై పలు హిందూ సంస్థలు - ఆధ్యాత్మిక గురువులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 'ఆనంద వికటన్' అనే తమిళ మ్యాగజైన్‌కు ప్రతి వారం రాసే కాలమ్‌లో కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారి కలకలం రేపాయి. ఒక వర్గం ప్రజలని కొంచం ఘాటుగానే ఇబ్బందిపెట్టాయికూడా

వ్యాఖ్యలకు నిరసనగా
తాజాగా ఆ వ్యాఖ్యలకు నిరసనగా ఇద్దరు చిన్నారులు కమల్ పోస్టర్ ను కత్తులతో పొడుస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోను చూసిన కమల్ తీవ్రంగా కలత చెందారు. ఆ వీడియో చూడటం కంటే ఆ బాలుల చేతుల్లో చావడం మంచిదని కమల్ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.

కమల్ పోసర్లను కత్తితో పొడుస్తున్నారు
కమల్ హిందూ ఉగ్రవాదం వ్యాఖ్యల నేపథ్యంలో ఆ వీడియోను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సుమారు నాలుగేళ్ల వయసున్న ఇద్దరు బాలురు నుదుటిపై - భుజాలపై విభూది రాసుకుని కమల్ పోసర్లను కత్తితో కసిగా పొడుస్తున్నారు. పిల్లల చేతికి కత్తి ఇచ్చి కమల్ పోస్టర్లపై పొడవండి అంటూ ఓ వ్యక్తి అరవడం ఆ వీడియోలో రికార్డ్ అయింది.

నన్ను చంపే హక్కు మీకే ఉంది
ఆ వీడియో కమల్ హసన్ చూడడంతో ఆయన ట్విటర్ ద్వారా స్పందించారు. "ఈ ప్రకృతి నన్ను ఎటూ చంపేస్తుంది. కానీ దాని కంటే ముందే నన్ను చంపే హక్కు మీకే ఉంది. నన్ను చంపడానికి ప్రయత్నించండి. నేను తప్పకుండా గెలుస్తాను." అని కమల్ ఆవేదనపూరిత ట్వీట్ చేశారు.

కుల మత వివరాలను
కమల్ వ్యాఖ్యలకు ఖుష్బూ ప్రకాశ్ రాజ్ తదితర సినీ ప్రముఖులు మద్దతు తెలిపారు. ప్రభుత్వ దరఖాస్తులలో బర్త్ సర్టిఫికెట్లలో అభ్యర్థులు తమ కులం మతం వివరాల నమోదును ఐచ్ఛికం చేస్తూ కేరళ ప్రభుత్వం ఓ సర్క్యులర్ ను జారీచేసింది. దాని ప్రకారం అభ్యర్థులు తమకు ఇష్టమైతేనే కుల మత వివరాలను దరఖాస్తులలో పొందుపరచవచ్చు.

అవసరం లేదు
తప్పనిసరిగా నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఆ సర్క్యులర్ ను ట్యాగ్ చేస్తూ కమల్ ట్వీట్ చేశారు. కేరళ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకుందని కమల్ కితాబిచ్చారు. తన కూతుళ్ల బర్త్ సర్టిఫికెట్లలో కుల మత వివరాలు నమోదు చేయడానికి తాను నిరాకరించానని గుర్తు చేసుకున్నారు.
శ్రుతీ హాసన్ హిందువుగా
21 ఏళ్ల తర్వాత వారు తమ కులమతాలను నిర్ణయించుకున్నారని చెప్పారు. శ్రుతీ హాసన్ హిందువుగా ఉండడానికి ఇష్టపడుతోందని అక్షర మాత్రం కుల మతాల పట్టింపు లేకుండా ఉండే అవకాశముందన్నాడు. కొంత కాలం క్రితమే తాను బౌద్దాన్ని స్వీకరిస్తూన్నానంటూ అక్షరహసన్ చెప్పిన విషయం తెలిసిందే..


Click it and Unblock the Notifications











