»   » కమల్ రెండో కూతురు హీరోయిన్ గా...

కమల్ రెండో కూతురు హీరోయిన్ గా...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కమల్‌ హాసన్‌ పెద్ద కుమార్తె శృతి హాసన్ ఇప్పుడు తెలుగులో స్టార్ హీరోయిన్. ఆమె బాటలోనే చెల్లెలు అక్షర హాసన్ కూడా నడవబోతోంది. ఆర్‌.బల్కి రూపొందించబోతున్న ఓ హిందీ సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోబోతున్నారని సచారం. ఇంతకాలం డైరక్షన్ డిపార్టెమెంట్ లో అశోశియేట్ డైరక్టర్ గా పలువురు దర్శకుల దగ్గర పనిచేసిన అక్షర ఉన్నట్టుండి నటనవైపు ఆసక్తి చూపించటంతో కమల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.

అక్షరతో జతకట్టే హీరో వివరాలు ఆర్‌.బల్కి వెల్లడించాల్సి ఉంది. అలాగే ముంబయికి మకాం మార్చమని చెల్లెలికి సలహా ఇచ్చిందట శ్రుతి హాసన్‌. అక్షర కూడా ముంబయిలో ఫ్లాటు కోసం అన్వేషిస్తున్నట్లు సన్నిహితులు తెలిపారు.


Kamal Haasan’s daughter Akshara to make her debut in R Balki’s next?

కమల్ కూతురు అనే ముద్రతో వెండి తెర మీదకొచ్చినా ఇప్పుడు తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సాధించింది శ్రుతి హాసన్‌. ప్రస్తుతం ఆమె తెలుగు, హిందీల్లో చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉంది. ఇప్పుడు ఆమె బాటలోనే చెల్లెలు అక్షర హాసన్‌ కూడా నడవాలని భావిస్తున్నట్లు బాలీవుడ్‌ సమాచారం.

తండ్రితో పాటు శృతిని స్ఫూర్తిగా తీసుకుని అక్షర హాసన్‌ కూడా తెరంగేట్రం చేయబోతోందని వినికిడి. ఇందుకోసం ఇప్పటికే పావులు కదుపుతోందని, అందుకు తండ్రి మద్ధతు కూడా ఆమెకు ఉందని అంటున్నారు. అక్షర హాసన్‌ మొదటిగా బాలీవుడ్‌లో పాగా వేయాలని కోరుకుంటోందని, ఓ హిందీ చిత్రంలో ఆమెను ఎంపికచేశారని చెప్పుకుంటున్నారు. అక్షర కూడా తన అక్క శృతి మాదిరిగానే సినీ పరిశ్రమలో ఏ శాఖ ఎంచుకోవాలన్న తర్జనభర్జనలో ఉందని అంటున్నారు. మొదట్లో శృతి కూడా గాయనిగా, సంగీత దర్శకురాలిగా రాణించాలని అనుకుని, ఆ తర్వాత నటనను వృత్తిగా ఎంచుకోవడం విశేషం. ఇక అక్షర కూడా హీరోయిన్‌గా, రచయిత్రిగా, దర్శకురాలిగా ఎందులో రాణిస్తే అందులో స్థిరపడాలని ఆకాంక్షిస్తోందట.

English summary
The legendary actor Kamal Haasan has reasons to rejoice, this time around not for the success of any of his films, but for being a proud father. After Shruti Haasan ruling the film industry down South and slowly carving a niche in Bollywood as well, it’s Akshara’s turn to make her mark. Reportedly, Kamal Haasan’s younger daughter Akshara is soon to make her debut in Bollywood. According to sources, Akshara is believed to have been approached by filmmaker R Balki, for his next project. Superstar Kamal Haasan and actress Sarika's younger daughter Akshara who assisted director Rahul Dholakia and also her father on Vishwaroopam, has not faced the camera so far.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu