»   » ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఫ్యామిలీలో విషాదం!

ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఫ్యామిలీలో విషాదం!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్‌ హాస‌న్ ఫ్యామిలీలో విషాదం చోటు చేసుకుంది. కమల్ హాసన్ అన్న చంద్ర‌హాస‌న్(82) అనారోగ్యంతో కన్నుమూసారు. ప్రస్తుతం లండ‌న్‌ లో కుమార్తె అను హాసన్ వ‌ద్ద ఉంటున్న చంద్రహాసన్ గుండెపోటు కారణంగా ఆదివారం ఉదయం మరణించారు.

ఈ ఏడాది ప్రారంభం జనవరి 7న భార్య గీతామణి (73) మరణంతో చంద్రహాసన్ డిప్రెషన్లోకి వెళ్లిపోయారు. ఆ బాధతోనే ఆయన గుండెపోటుకు గురై మరణించినట్లు తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే కమల్ హాసన్, ఇంతర కుటుంబ సభ్యులు లండన్ బయల్దేరారు.

నిర్మాతగా

నిర్మాతగా

నిర్మాతగా రాజ్ క‌మ‌ల్ ఇంట‌ర్నేష‌న‌ల్ ఫిలింస్‌ పతాకాన్ని స్థాపించిన చంద్రహాసన్ సౌత్ లో అనేక చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

కమల్ సినిమాలు

కమల్ సినిమాలు

చంద్ర హాసన్ నిర్మాణంలో కమల్ హీరోగా కొన్ని సినిమాలు రూపొందాయి. నల దమయంతి, విరుమంద, విశ్వరూపం, ఉత్తమ విలన్ వంటి చిత్రాలు ఆయన నిర్మాణంలో తెరకెక్కినవే.

శభాష్ నాయుడు

శభాష్ నాయుడు

కమల్ తాజా చిత్రం శభాష్ నాయుడుకి కూడా చంద్ర హాసనే నిర్మాణ బాధ్యతలను నిర్వర్తించినట్లు సమాచారం. చంద్రహాసన్ మరణం పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

rn

వరుస విషాదాలు

కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే దిల్ రాజు సతీమణి గుండెపోటుతో మరణించడం, జయసుధ భర్త నితిన్ అనుమానాస్పద మృతి, నిన్న ఐశ్వర్యరాయ్ కి పితృ వియోగం, ఇపుడు కమల్ హాసన్ సోదరుడు చంద్ర హాసన్ కన్నుమూత లాంటివి చోటు చేసుకున్నాయి.

English summary
Kamal Haasan's elder brother Chandrahasan passed away at his residence in London on Friday. According to reports, Chandrahasan suffered a cardiac arrest. He was 82.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu