twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డబ్బుల గొడవతో... ‘ఉత్తమ విలన్’ విడుదల ఆగింది

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కమల్ హాసన్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘ఉత్తమ విలన్' సినిమా అన్ని అడ్డంకులు తొలగించుకుని ఈ రోజు విడుదలవుతుందని అంతా అనుకుంటున్న తరుణంలో అనుకోని కారణాలతో విడుదల ఆగి పోయింది. నిర్మాతలకు, ఫైనాన్సియర్లకు మధ్య డబ్బు విషయంలో వచ్చిన గొడవే సినిమా ఆగి పోవడానికి కారణమని తెలుస్తోంది.

    ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. మరి ఈ రోజు కనీసం ఒక్క షో అయినా పడుతుందా? లేక విడుదల వాయిదా పడుతుందా? అనేది చర్చల తర్వాత తేలనుంది. సినిమా విడుదల ఆగి పోవడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ రోజు సాయంత్రం వరకు థియేటర్లలో విడుదలవుతుందని ఎదురు చూస్తున్నారు. మరో వైపు మార్నింగ్ షో టికెట్స్ కొన్న వారికి డబ్బులు తిరిగి ఇచ్చేస్తుండటం గమనార్హం.

    Kamal Haasan's Uttama Villain release cancelled Over 'Financial Issues'

    ఉత్తమ విలన్ చిత్రానికి రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించారు. పూజాకుమార్‌, ఆండ్రియా, పార్వతీ మేనన్‌ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని తెలుగులో సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. కమల్‌హాసన్‌ ద్విపాత్రాభినయం చేస్తున్న తమిళ సినిమా ‘ఉత్తమవిలన్‌'. ఎన్‌.లింగుస్వామికి చెందిన తిరుపతి బ్రదర్స్‌, కమల్‌హాసన్‌ కు చెందిన రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది. గిబ్రన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై. లిమిటెడ్‌ పతాకంపై సి.కళ్యాణ్‌ అదే పేరుతో తెలుగులో విడుదల చేస్తున్నారు.

    English summary
    Actor Kamal Haasan's new film Uttama Villain has not been released this morning as scheduled. Theatre owners cancelled the morning show citing financial issues between producers and financiers.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X