‘విశ్వరూపం 2’ రిలీజ్ డేట్ ఫిక్స్.... సపోర్టుగా నిలిచిన ఎన్టీఆర్, అమీర్ ఖాన్!
కమల్ హాసన్ హీరోగా 2013లో వచ్చిన 'విశ్వరూపం' సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న 'విశ్వరూపం 2' ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ ఖరారు చేస్తూ ప్రముఖ సినీ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ట్రైలర్ నేటి(జూన్ 11) సాయంత్రం 5 గంటలకు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
విశ్వరూపం 2 మూడు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ వెర్షన్ ట్రైలర్ శృతి హాసన్, తెలుగు వెర్షన్ ట్రైలర్ జూ ఎన్టీఆర్, హిందీ వెర్షన్ ట్రైలర్ బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ట్విట్టర్ ద్వారా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
'విశ్వరూపం 2' చిత్రాన్ని కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించారు. మొదటి భాగంలో ఉన్న నటులు పార్ట్ 2లోనూ కంటిన్యూ అయ్యారు, అయితే పార్ట్ 2లో వహీదా రెహమాన్, అనంతర్ మహదేవన్ కొత్తగా జాయిన్ అయ్యారు. గిబ్రన్ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదలైన ఫష్ట్ లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది.

విశ్వరూపం మొదటి భాగం 2013 జనవరిలో విడుదలైంది. అదే ఏడాది చివర్లో పార్ట్ 2 రావాల్సి ఉండగా పలు కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఎట్టకేలకు విడుదలకు సిద్ధం చేశారు.


Click it and Unblock the Notifications











