ఇంట్రెస్టింగ్: కమల్ భారతీయుడు-2 షూటింగ్ హైదరాబాద్‌లో..
భారతీయుడు.. 1996లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే పాత్రలో కమల్ నటన.. ఆయన మేనరిజమ్స్ ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాయి. అందుకే ఎవర్ గ్రీన్ చిత్రాల సరసన భారతీయుడుకి చోటు దక్కుతుంది.
ఇకపోతే మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. మళ్లీ అదే కాంబినేషన్ లో ఈ సినిమా రాబోతుండటం మరో విశేషం. సీక్వెల్ కోసం ఇప్పటికే స్క్రిప్టు కూడా సిద్దం చేశాడు దర్శకుడు శంకర్. థాయిలాండ్ లో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసినట్టు సమాచారం.

ఇక మరో ఆసక్తికర విషయమేంటంటే.. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే మొదలుపెట్టనున్నారట. రామోజీ ఫిలిం సిటీలో ఇందుకోసం కొన్ని ప్రత్యేక సెట్స్ సిద్దం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. షెడ్యూల్ ఫిక్స్ అయితే చిత్ర యూనిట్ త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ మొదలుపెడుతారని చెబుతున్నారు.
కాగా, ఈ సినిమాకు తొలుత నిర్మాతగా దిల్ రాజు వినిపించినప్పటికీ.. ఆ తర్వాత ఆయన వెనక్కి తగ్గారు. దీంతో లైకా ప్రొడక్షన్స్ ఇప్పుడు నిర్మాణ బాధ్యతలను తీసుకుంది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం శంకర్-రజనీల సినిమా 2.ఓ పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











