»   » కమల్ ఏమిటిదీ..?? ఆ సినిమా అసలు షూటింగే అవలేదట

కమల్ ఏమిటిదీ..?? ఆ సినిమా అసలు షూటింగే అవలేదట

Posted By:
Subscribe to Filmibeat Telugu

కమల్ నటించిన 'విశ్వరూపం' సినిమా అప్పట్లో సంచలనాన్ని సృష్టించింది.విశ్వరూపం ఎన్ని వివాదాలు సృష్టించిందో అందరికీ తెలిసిందే. తమిళనాట దాదాపు థియేటర్లన్నీ ఈ సినిమాను బ్యాన్ చేశాయి. ఒక దశలో దేశం విడిచి వెళ్లిపోతానంటూ కమల్ హెచ్చరించాడు కూడా. దానితర్వాత రావాల్సిన విశ్వరూపం 2 చాలా ఆలస్యమయ్యింది. జనం దాదాపుగా ఆ సీక్వెల్ గురించి మర్చి పోతున్న సమయం లో మళ్ళీ త్వరలో విడుదల అంటూ సంచలనం రేపాడు కమల్ అంతా ఎదురు చూడటం మొదలు పెట్టారు అయితే నిజానికి ఆ సినిమా షూటింగ్ కూడా పూర్తికాలేదట...

ఆస్కార్ రవిచంద్రన్

ఆస్కార్ రవిచంద్రన్

ఎన్నో అడ్డంకుల్ని అధిగమించి విశ్వరూపం-1 సినిమా థియేటర్లలోకి వచ్చింది. మొదటి సినిమా అనుభవాలతో పార్ట్-2ను రిలీజ్ చేసేందుకు నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ఇంట్రెస్ట్ చూపించలేదు. డబ్బులు పోతే పోయాయి అనుకొని వదిలేశాడు. కానీ కమల్ మాత్రం వదల్లేదు. ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రంగంలోకి దిగిన కమల్, అందుకు సంబంధించిన ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అంతా అనుకున్నారు.

ఈద్ కానుకగా

ఈద్ కానుకగా

ఇటీవల చిత్ర ఫస్ట్ లుక్ విడుదల చేసిన కమల్ ఈద్ కానుకగా జూన్ 23న టీజర్ విడుదల చేసి మూవీ పై భారీ అంచనాలు పెంచాలని ప్రయత్నిస్తున్నాడని ప‌లు వార్త‌లు వ‌చ్చాయి. దీనిపై క‌మ‌ల్ తాజాగా త‌న ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చాడు. అస‌లు ఈ టీజ‌ర్ విడుద‌ల‌వుతుంద‌నే వార్త‌లు ఎక్క‌డ నుండి ఎలా పుట్టుకొచ్చాయో తెలియ‌దు..

పుకార్ల‌ను న‌మ్మోద్దు

పుకార్ల‌ను న‌మ్మోద్దు

రాజ్ క‌మ‌ల్ ఫిలింస్ ఇంట‌ర్నేష‌న‌ల్ సంస్థ అఫీషియ‌ల్ క‌న్ఫ‌ర్మేష‌న్ ఇచ్చే వ‌ర‌కు ఎలాంటి పుకార్ల‌ను న‌మ్మోద్దు అని క‌మ‌ల్ అన్నాడు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదల కానున్న విశ్వ‌రూపం 2 చిత్రంలో రాహుల్ బోస్, పూజా కుమార్ మరియు అందేరా జెరమై ప్రధాన పాత్రలు పోషించారు. జీబ్రాన్ సంగీతం అందించాడు. దీపావళికి చిత్రాన్ని రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడు క‌మ‌ల్.

ఇంకా 10 శాతం షూటింగ్

ఇంకా 10 శాతం షూటింగ్

అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకా 10 శాతం షూటింగ్ మిగిలి వుందనీ, త్వరలోనే పూర్తి చేస్తానని కమల్ అసలు విషయాన్ని చల్లగా చెప్పారు. ఈ సినిమాకి పనిచేసిన వాళ్లంతా ఇప్పుడు వేరే ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. వాళ్లందరినీ మళ్లీ ఒక టీమ్ గా ఏర్పాటు చేసి మిగిలిన భాగాన్ని షూటింగ్ చేయడం అంత తేలికైన విషయం కాదు.

ఈ ఏడాది రాకపోవచ్చు

ఈ ఏడాది రాకపోవచ్చు

అందువలన కమల్ చెప్పినట్టుగా ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విశ్వరూపం సినిమా విడుదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత పెట్టిన ఆంక్షల వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న కమల్.. చివరకు మీడియా ముందు కంటతడి కూడా పెట్టుకున్నాడు.

క్లారిటీ లేనట్టే

క్లారిటీ లేనట్టే

ఇక సీక్వెల్‌ను దాదాపూ పూర్తి చేసినా.. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల సినిమాను నిలిపేస్తున్నట్లు కమల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయని తెలుస్తోంది. మరి అన్ని అడ్డంకులూ దాటి వెలుగు చూడబోతున్న 'విశ్వరూపం 2' ఎన్నాళ్ళకి మన ముందుకు వస్తుందో ఇప్పటికైతే ఇంకా ఏ క్లారిటీ లేనట్టే...

English summary
Latest reports have surfaced that 10% shoot is remaining for the film, which will be completed at the Officer’s Training Academy in Chennai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu