ఆమె కోసం కమల్ అన్వేషణ ఫలించేదెన్నడో?
కమల్ హాసన్ స్వీయ దర్శకత్వంలో రూపొందిన విశ్వరూపం సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. అయితే హీరోయిన్ మాత్రం ఇప్పటికీ ఖరారు కాలేదు. ఈ సినిమాలో సరైన హీరోయిన్ కోసం కమల్ హాసన్ చాలా కాలంగా అన్వేషన్ కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఎవరూ ఎంపిక కాలేదు. కొన్ని కారణాలు వల్ల ఈ సినిమాలో నటించడానికి హీరోయిన్లు విముఖత వ్యక్తం చేస్తే...సముఖత వ్యక్తం చేసిన హీరోయిన్లు కమల్ కు నచ్చడం లేదు. దీంతో హీరోయిన్ ఎంపిక రోజురోజుకూ జాప్యం అవుతూనే ఉంది.
తొలుత ఈ సినిమాలో సోనాక్షి సిన్హాను తీసుకోవాలనుకున్నాడు కమల్. అయితే ఈ ప్రాజెక్టు లేటు అువుతండటం, మరి కొన్ని కారణాల వల్ల సోనాక్షి కమల్ కు హ్యాండిచ్చింది. తర్వాత సమీరారెడ్డిని ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆమెను ఫైనల్ చేసినట్లు కమల్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దీన్ని బట్టి కమల్ హీరోయిన్ కోసం ఇంకా అన్వేషణ కొనసాగిస్తున్నాడని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications