»   » కమల్ హాసన్ వద్ద హీరో నానికి ఊహించని అనుభవం

కమల్ హాసన్ వద్ద హీరో నానికి ఊహించని అనుభవం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న నానికి తాజాగా....లోకనాయకుడు హీరో కమల్ హాసన్ వద్ద ఊహించని అనుభవం ఎదురైంది. ఆ విషయాలను కడుపులో దాచుకోవడం ఇష్టం లేక ట్విట్టర్ ద్వారా బయట పెట్టాడు నాని. ఇంతకీ ఏం జరిగిందనేగా మీ డౌట్?

నానికి కమల్ హాసన్ అంటే చిన్న నాటి నుంచి మహా అభిమానం. ఆయన్ను ఆదర్శంగా తీసుకునే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తన ప్రతిభ, కష్టపడే తత్వానికి తగిన విధంగా కాలం కలిసి రావడంతో ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాడు. ప్రస్తుతం నాని యష్ రాజ్ ఫిలింస్ సంస్థతో 'బ్యాండ్ బాజా బారత్'రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఈ చిత్రం షూటింగ్ జరుగుతోంది.

As I said a lot of times earlier .. One man who's an inspiration and reason for me to realise cinema is wer I belong .. Kamal sir :)
— nani (@NameisNani) July 24, 2013

We are shooting in adjacent floors .. He for vishwaroopam and me for yash raj films .. And I was getting nervous in my own set ;)
— nani (@NameisNani) July 24, 2013

Like a kid who wants to get a glimpse of his favourite movie star .. Thot will go meet him and take a pic and ask for an autograph
— nani (@NameisNani) July 24, 2013

To my surprise what followed was a warm welcome..He knows me and has seen my work ...Yahooooo..Couldn't believe it..
— nani (@NameisNani) July 24, 2013

He introduced me to his heroine and told her how my name has a different meaning in tamil when its just a pet name in Telugu
— nani (@NameisNani) July 24, 2013

అయితే నాని చిత్రం షూటింగ్ జరుగుతున్న సమీపంలోనే కమల్ హాసన్ 'విశ్వరూపం-2' చిత్రం షూటింగ్ జరుగుతోంది. కమల్ హాసన్‌ను కలిసేందుకు ఇంతకు మించిన మంచి అవకాశం దొరకదని భావించిన నాని అక్కడికి వెళ్లగానే ఊహించని అనుభవం ఎదురైంది.

ఈ విషయాన్ని ఆయన తన ట్విట్టర్లో వెల్లడిస్తూ....'ఆశ్చర్యం కలిగే విధంగా నాకు కమల్ సార్ యూనిట్ సభ్యుల నుంచి సాదర స్వాగతం లభించింది. కమల్ సార్‌కు నా గురించి తెలుసన్నారు, నా వర్క్ కూడా చూసానన్నారు. ఆ విషయాన్ని నేను నమ్మలేకపోయాను. ఆయన తన హీరోయిన్ కి నన్ను పరిచయం చేసారు. అలాగే తెలుగులో ముద్దుపేరుగా పిలుచుకునే నా పేరుకి తమిళ్లో ఓ డిఫరెంట్ అర్ధం వస్తుందని చెప్పారు' అని వెల్లడించారు.

English summary
"As I said a lot of times earlier .. One man who’s an inspiration and reason for me to realise cinema is wer I belong .. Kamal sir. We are shooting in adjacent floors .. He for vishwaroopam and me for yash raj films .. And I was getting nervous in my own set.

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X