twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇదేం ప్రభుత్వం..? సినిమాలు వదిలేస్తా..! కమల్ హసన్ అల్టిమేటం

    కమల్ హసన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంటుంది. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించే విశ్వనటుడు కమల్ హసన్..

    |

    కమల్ హసన్ సినిమా రిలీజ్ అవుతుందంటే ప్రేక్షకుల్లో ఎనలేని ఆసక్తి నెలకొంటుంది. ప్రతి చిత్రంలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపించే విశ్వనటుడు కమల్ హసన్.. ప్రస్తుతం విశ్వరూపం-2, శభాష్ నాయుడు వంటి చిత్రాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమాల నిర్మాణం కన్నా కమల్ తీసుకున్న ఓ నిర్ణయం జనాల్లో అమితమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది.

    హిందీ అంగీకరించినా

    హిందీ అంగీకరించినా

    హిందీ సినీ పరిశ్రమ జీఎస్టీని అంగీకరించినా తాము(దక్షిణాది) ఒప్పుకోబోమని, సినిమాపై విధిస్తున్న 28% జీఎస్టీని కేంద్రప్రభుత్వం తొలగించాలని లేదా తగ్గించాలని విశ్వనటుడు కమల్‌హాసన్ డిమాండ్‌ చేశారు. కేంద్రం జీఎస్టీని తగ్గించకపోతే సినిమాల నుంచి తప్పుకుంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

    జీఎస్టీ పన్నుని తగ్గించాలని

    జీఎస్టీ పన్నుని తగ్గించాలని

    సినీరంగంపై జీఎస్టీ పన్నుని తగ్గించాలని కొంతకాలంగా దక్షిణాది సినీ పరిశ్రమలు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్య మండలి (ఫిలిం ఛాంబర్‌) శుక్రవారం చెన్నైలో అత్యవసర సమావేశం ఏర్పాటుచేసింది.

    12 లేదా 18కి తగ్గించాలని

    12 లేదా 18కి తగ్గించాలని

    ఈ కార్యక్రమంలో కమల్‌హాసన, ఛాంబర్‌ అధ్యక్షుడు ఎల్‌కే సురేష్‌, థియేటర్‌ యజమానుల సంఘం తరపున అభిరామి రామనాథన, ఛాంబర్‌ గౌరవ కార్యదర్శి కాట్రగడ్డ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 28% జీఎస్టీ విధిస్తే సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని, దీనిని 12 లేదా 18కి తగ్గించాలని ఛాంబర్‌ అధ్యక్షుడు సురేష్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.

    హాలీవుడ్‌తో పోల్చకూడదు

    హాలీవుడ్‌తో పోల్చకూడదు

    ప్రాంతీయ చిత్రాలను బాలీవుడ్, హాలీవుడ్‌తో పోల్చకూడదని కమల్ హాసన్ అన్నారు. నిత్యవసర వస్తువుల మాదిరిగా దేశవ్యాప్తంగా సినిమా టికెట్లపై ఒకే పన్ను విధానం ఉండకూడదన్నారు. జీఎస్టీ తీరు ఈస్ట్ ఇండియా కంపెనీ మాదిరిగా ఉండకూడదని కమల్ హాసన్ అన్నారు. నల్ల ధనం నిరోధానికి పెద్ద నోట్లను రద్దు చేశారని, సినిమా రంగంపై జీఎస్టీలో 28 శాతం పన్ను విధిస్తే ఈ పరిశ్రమ రెండు రెట్లు వెనక్కి వెళ్తుందని కమల్ హాసన్ ఆందోళన వ్యక్తం చేశారు.

    జీఎస్టీ కౌన్సిల్‌ 15వ సమావేశం

    జీఎస్టీ కౌన్సిల్‌ 15వ సమావేశం

    శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ అధ్యక్షతన జీఎస్టీ కౌన్సిల్‌ 15వ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కమల్‌ విజ్ఞప్తిని ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది.ప్ర‌స్తుతం టాలీవుడ్ లో పెద్ద సినిమాల‌కు 15శాతం, చిన్న సినిమాకు 7 శాతం, డ‌బ్బింగ్ మూవీల‌కు 20 శాతం ప‌న్ను ఉంది.

    ప్రభుత్వమా..లేక ఈస్ట్‌ ఇండియా కంపెనీనా

    ప్రభుత్వమా..లేక ఈస్ట్‌ ఇండియా కంపెనీనా

    ఇది ప్రభుత్వమా..లేక ఈస్ట్‌ ఇండియా కంపెనీనా అని కమల్‌ హాసన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంతీయ సినిమాలు, హాలీవుడ్‌ సినిమాలు, హిందీ సినిమాలను ఒకే పన్ను శ్లాబ్‌లోకి తేరాదని కోరారు.జులై 1 నుంచి జీఎస్‌టీని దేశవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.

    English summary
    Actor-filmmaker Kamal Haasan says the entertainment and service tax for the film industry will be replaced by a single 28 per cent tax. "We welcome GST and one India one tax. But this rate will ruin regional cinema," Mr Haasan told reporters.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X