కమల్ హాసన్‌పై హైకోర్టులో పిటిషన్..సందిగ్ధంలో విశ్వరూపం 2 విడుదల!
లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన తాజా చిత్రం విశ్వరూపం 2. ఈ చిత్రం ఆగష్టు 10 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ తరుణంలో కమల్ హాసన్ కు చిక్కులు వచ్చిపడ్డాయి. దీనితో విడుదల విషయంలో సందిగ్దత నెలకొని ఉంది. కమల్ హాసన్ ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ బ్యానర్ లో నిర్మించారు. మరో ప్రొడక్షన్ హౌస్ తో వివాదం ఏర్పడింది. పిరమిడ్ సైమిరా అనే నిర్మాణ సంస్థ విశ్వరూపం 2 చిత్రంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

7 కోట్లకు పైగా
రాజ్ కమల్ ఫిలిమ్స్ సంస్థలో కమల్ హాసన్ కూడా భాగస్వామి. ఈ సంస్థ దాదాపు 7.75 కోట్ల బకాయిలు ఇంకా అలాగే ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విశ్వరూపం 2 చిత్రం విడుదలైతే ఆ బకాయిలు తిరిగి పొందడం కష్టం అని పిటిషనర్ పేర్కొన్నారు.

ఆదేశించిన కోర్టు
దీనిపై సమాధానం ఇస్తూ ఈ నెల 6 లోపు కౌటర్ పిటిషన్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారే చేసింది. కేసు కనుక ముదిరితే విశ్వరూపం 2 చిత్రం విడుదల సందిగ్ధంలో పడ్డట్లే.

అసలు సంగతి ఏంటంటే
గతంలో కమల్ హాసన్ కు, పిరమిడ్ సైమిరా సంస్థ మధ్య ఒప్పదం జరిగింది. అప్పట్లో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో మర్మయోగి చిత్రం ప్రారంభమైంది. ఆ సమయంలో ఈ సంస్థ కమల్ కు దాదాపు 10 కోట్ల రూపాయలు అందించినట్లు తెలుస్తోంది. ఆ చిత్రం ఆగిపోవడంతో ఆ డబ్బుని కమల్ మరో సినిమాకు వాడుకున్నారని ఆరోపిస్తున్నారు.

విశ్వరూపం సమయంలో కూడా
విశ్వరూపం సమయంలో కూడా విడుదుల విషయంలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. విశ్వరూపం చిత్రంలో నటించిన నటీనటులే రెండవ భాగంలో కూడా నటించారు. పూజ కుమార్, ఆండ్రియా కీలక పాత్రలో నటించారు.


Click it and Unblock the Notifications











