Vikram Twitter Review: విక్రమ్ మూవీకి షాకింగ్ టాక్.. సినిమాలో కమల్ మిస్సింగ్.. ఫైనల్‌గా ఎలా ఉందంటే!
తమిళ సినీ పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. భారతదేశం మొత్తం తన మార్కెట్‌ను గణనీయంగా పెంచుకుని సుదీర్ఘ కాలంగా సత్తా చాటుతున్నాడు విశ్వనాయకుడు కమల్ హాసన్. కెరీర్ ఆరంభం నుంచే హిట్లు ఫ్లాపులతో ఏమాత్రం సంబంధం లేకుండా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళ్తోన్న ఆయన.. ఎన్నో భారీ విజయాలను అందుకున్నాడు. దీంతో చాలా కాలం క్రితమే పాన్ ఇండియా స్టార్ అనిపించుకున్నారు. ఇక, ఈ మధ్య కాలంలో చాలా గ్యాప్ తీసుకున్న కమల్.. ఇప్పుడు 'విక్రమ్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీకి ఎలాంటి టాక్ వచ్చింది? ఇందులో ప్లస్‌లు, మైనస్‌లు ఏంటి? అనేవి వాటిపై ట్విట్టర్ రివ్యూ మీ కోసం!
Recommended Video


విక్రమ్‌గా ఎంట్రీ ఇచ్చేసిన కమల్
కమల్ హాసన్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన చిత్రమే ‘విక్రమ్'. ఇందులో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, సూర్య, కార్తిలు కీలక పాత్రలు చేశారు. ఈ మూవీని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు. మరికొందరు ప్రముఖులు కీలక పాత్రలు చేశారు.

అంచనాలు పెంచేసిన అప్డేట్స్
మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘విక్రమ్' మూవీపై ఆరంభం నుంచే అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైన మంచి రెస్పాన్స్ వచ్చింది. మరీ ముఖ్యంగా ఈ సినిమా టీజర్, ట్రైలర్‌కు భారీగా వ్యూస్ వచ్చాయి. అలాగే, పాటలు కూడా ఎంతగానో ఆకట్టుకున్నాయి. దీంతో కమల్ చిత్రంపై తెలుగు, తమిళంలో బజ్ ఏర్పడింది.

బిజినెస్‌కు తగ్గట్లు గ్రాండ్ రిలీజ్
‘విక్రమ్' మూవీకి తమిళంలో భారీ బిజినెస్ జరిగింది. అలాగే, ఆయనకు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి మార్కెట్ ఉంది. దీంతో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రూ. 8 కోట్ల బిజినెస్ అయింది. హీరో నితిన్ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశాడు. బిజినెస్‌కు అనుగుణంగానే విక్రమ్ మూవీని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

కమల్ సినిమాకు అలాంటి టాక్
స్టార్ హీరో కమల్ నటించిన ‘విక్రమ్' మూవీ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో షోలు కూడా ప్రదర్శితం అయ్యాయి. ఇప్పటి వరకూ అందిన సమాచారం ప్రకారం.. ఆరంభంలోనే ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది. చాలా మంది కమల్ హాసన్‌కు సరైన కమ్‌బ్యాక్ మూవీ ఇదే అని ట్విట్టర్ వేదికగా పోస్టులు చేస్తున్నారు.

ఫస్టాఫ్ ఇలా.. సెకెండాఫ్ మరోలా
‘విక్రమ్' మూవీ ఓవరాల్‌గా చూసుకుంటే.. ఫస్టాఫ్ మొత్తం టెర్రిఫిక్ ఇంట్రో సీన్‌లతో పాటు ఇంటర్వెల్ ట్విస్ట్‌తో యాక్షన్ ప్యాక్‌లా సాగిపోతుందట. మరీ ముఖ్యంగా విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్, కమల్ క్యారెక్టర్లను చూపిన తీరు అదిరిపోతుందట. అయితే, సెకెండాఫ్ మాత్రం కొంత ల్యాగ్ ఉన్నట్లుగా అనిపిస్తుందని తెలిసింది. అయితే, క్లైమాక్స్ మాత్రం ఓ రేంజ్‌లో ఉంటుందట.

సినిమాలో ప్లస్... మైనస్‌లు ఇవే
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన ‘విక్రమ్' మూవీని చూసిన వాళ్లంతా ఇచ్చిన రిపోర్టుల ప్రకారం.. ఇందులో కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటన అద్భుతంగా ఉందట. అలాగే, సూర్య, కార్తి పాత్రలు ఆశ్చర్యానికి గురి చేస్తాయని తెలిసింది. ఇక, అనిరుధ్ బ్యాగ్రౌండ్, యాక్షన్ సీన్స్ సూపర్ అని టాక్. అయితే, సెకెండాఫ్‌లో కొంత ల్యాగ్ మైనస్ అయిందట.

ఫైనల్‌గా సినిమా ఎలా ఉందంటే
తాజా సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్' మూవీ పూర్తిగా అభిమానులను అలరించే యాక్షన్ ప్యాక్‌గా తెరకెక్కించారని తెలుస్తోంది. కమల్‌పై ఉన్న ప్రేమను లోకేష్ కనగరాజ్ ఈ చిత్రంతో నిరూపించుకున్నాడట. చాలా కాలంగా ఆయన ఫ్యాన్స్ వేచి చూసే సినిమా ఇదే అంటున్నారు. మొత్తంగా అన్ని వర్గాల వాళ్లను ఆకట్టుకునే మూవీ అని టాక్.

మూవీలో కమల్ హాసన్ మిస్సింగ్
క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ‘విక్రమ్' మూవీ చూసిన వాళ్లంతా ఓ షాకింగ్ న్యూస్ చెబుతున్నారు. ఈ మూవీలో ఫస్టాఫ్‌లో కమల్ హాసన్ పాత్ర చాలా తక్కువ సమయమే ఉంటుందట. ఒక సందర్భంలో అసలు ఇది కమల్ సినిమానేనా అని సందేహం వస్తుందట. అయితే, సెకెండాఫ్‌లో మాత్రం ఆ లోటును భర్తీ చేశారనే టాక్ వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











