»   » నా దేశానికి, నా ప్రజలకి ప్రేమతో... ‘విశ్వరూపం 2’ (ఫస్ట్ లుక్)

నా దేశానికి, నా ప్రజలకి ప్రేమతో... ‘విశ్వరూపం 2’ (ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎన్నో వివాదాలు, అవాతరాల మధ్య గతంలో విడుదలైన కమల్ హాసన్ 'విశ్వరూపం' చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. త్వరలో దానికి సీక్వెల్ గా 'విశ్వరూపం 2' సినిమా రాబోతోంది.

తాజాగా 'విశ్వరూపం 2'కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. 'నా దేశానికి, నా ప్రజలకి ప్రేమతో' అనే వ్యాఖ్యతో రెప రెపలాడుతున్న త్రివర్ణ పతాకంతో కూడిన పోస్టర్‌ని ఆవిష్కరించారు కమల్‌ హాసన్.సినిమా రిలీజ్ ఎప్పుడనేది ఇంకా నిర్ణయించలేదు. ఈ పోస్టర్ రిలీజ్ తో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలయ్యాయి. క్రమక్రమంగా టీజర్, ట్రైలర్, ప్రచార చిత్రాలు రిలీజ్ చేస్తూ సినిమాపై అంచనాలు పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.


vishwaroopam 2

సినిమాపై హైప్ క్రియేట్ చేసి దేశ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళంలో సినిమాను భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.English summary
The first look of Kamal Haasan from his most awaited Vishwaroopam 2 has been unveiled. Kamal is simply rocking in this first look.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu