twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమ్మ, కాపు అంటూ పోల్చలేం: కమల్ హాసన్ (ఇంటర్వ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: కమల్ హాసన్ నటించిన ‘చీకటి రాజ్యం' త్వరలో విడుదలువున్న నేపథ్యంలో ఆయన సినిమా ప్రమోషన్లలో భాగంగా మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు మీడియా అడిగిన ఇతర ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.

    గతంలో కమల్ హాసన్ పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు దర్శకత్వం వహించక పోవడంపై స్పందిస్తూ...ఒక సినిమాను డైరెక్ట్ చేయడం, అందులో నటించడం...రెండు వేర్వేరు అంశాలుగా భావిస్తాను. వ్యక్తిగతంగా కథలో బాగా ఇన్‌వాల్వ్ అయినప్పుడే దర్శకత్వం చేపట్టాలి. చీకటిరాజ్యం కథ నాకు బాగా నచ్చింది. దర్శకుడు రాజేష్ సెల్వ ఏడు సంవత్సరాలుగా నాతో ప్రయాణం చేస్తున్నాడు. అతని కెరీర్‌కు మంచి ఆరంభమవుతుందనే ఉద్ధేశ్యంతో దర్శకుడిగా అవకాశమిచ్చాను.

    ఫస్ట్‌బ్లెడ్ బార్న్ సూప్రిమసీలాంటి హాలీవుడ్ చిత్రాల్లో కథానాయకుడి భావోద్వేగాలతో ప్రేక్షకులు సహానుభూతి చెందుతారు. హీరోపడే సంఘర్షణ చూసి ఉద్వేగానికి లోనవుతారు. ఆ సినిమాల తరహాలోనే ఇందులో కూడా హీరో పాత్రతో ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతారు అని కమల్ హసాన్ తెలిపారు.

    రజనీకాంత్ తో విబేధించడంపై

    రజనీకాంత్ తో విబేధించడంపై


    సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ ను తమిళనాడు ఆర్టిస్టు అసోసియేషన్ గా మార్చాలని రజనీకాంత్ డిమాండ్ చేయడాన్ని విబేధించాను. ఇందులో ఎన్టీఆర్, ఏఎన్నార్‌లాంటి లెజెండ్స్‌తో పాటు ఇతర భాషల నటీనటులున్నారు. కాబట్టి ఆ పేరును మార్చడం తప్పనిపించింది అన్నారు.

    భాషాపరమైన విబేధాలు వద్దు

    భాషాపరమైన విబేధాలు వద్దు


    నా దృష్టిలో భారతీయ నటీనటులందరూ భాషాపరమైన భేదాలు పాటించకుండా ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ పేరుతో చెలామణి అయితే బాగుంటుంది. హాలీవుడ్ వాళ్లకు ఇండియా నుంచి ఎవరైనా యాక్టర్స్ కావాలంటే ఇండియన్ యాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఎంపిక చేసుకుంటే అందరికి అవకాశాలు లభిస్తాయి. నా దృష్టిలో సినిమాకు ఎలాంటి భాషా భేదాలు వుండకూడదు. ఎక్కడైనా సరే ప్రతిభకు సరైన గుర్తింపు లభించాలి అన్నారు.

    కమ్మ, కాపు అంటూ పోల్చలేం...

    కమ్మ, కాపు అంటూ పోల్చలేం...


    దేవుణ్ణి నమ్మకపోయినా నేను అన్ని మతాల వారిని, మనుషుల్లో వుండే మానవత్వాన్ని గౌరవిస్తాను. కవి గుల్జార్ ముస్లిమా? సిక్కు మతస్థుడా? అనే విషయం గురించి ఆలోచించను. గుల్జార్ పేరు వినగానే నాకు ఆయన కవిత్వమే గుర్తుకు వస్తుంది. అలాగే బాలచందర్‌గారు ఎవరంటే కమ్మ, కాపు అని కులాల పేరుతో నిర్వచించలేం కదా? ఆయన సినిమాల గురించే ఆలోచిస్తాం. నేను నటించిన హేరామ్ ఎన్డీయే హయాంలో విడుదలైంది. దానిపై వివాదాలొచ్చాయి. విశ్వరూపం చిత్రం కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడే విడుదలైంది. విశ్వరూపం అమెరికా వ్యతిరేక చిత్రమని కాంగ్రెస్‌వాళ్లు ఆరోపించారు. దీన్ని బట్టి ప్రతి ప్రభుత్వం అసహంతోనే వుందనుకోవాలి. కాంగ్రెస్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్, ముస్లిమ్‌లీగ్...అందరూ అసహనంతోనే వున్నారు. వారందరూ అసహనంతో వుంటూ నన్ను మాత్రం సహనంతో వుండమని చెబుతున్నారు.

    వెయ్యి తప్పులు

    వెయ్యి తప్పులు


    యాభై ఏళ్లుగా సినీ ప్రయాణాన్ని సాగిస్తున్నాను. వెనక్కి తిరిగి చూడటం లాంటివి మాత్రం నేను చేయను. ఎప్పుడూ ముందుకు పోవాలనుకుంటాను. గతం గురించి ఆలోచిస్తే నాస్టాల్జియాలో మునిగిపోతాం. వెనక్కి తిరిగి చూసుకుంటే తప్పులే ఎక్కువగా కనిపిస్తాయి. రెండుమూడు తప్పులు కాదు..వెయ్యి తప్పులు కనిపిస్తాయి. అన్నారు.

    పౌరాణిక చిత్రం

    పౌరాణిక చిత్రం


    నేను ఇప్పటివరకు పౌరాణిక చిత్రాన్ని చేయలేదు. చాలా సంవత్సరాల క్రితం లంకేశ్వరుడు పేరుతో ఓ పౌరాణిక చిత్రాన్ని చేద్దామనుకున్నాను. అనుకోని కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. అన్నీ కుదిరితే భవిష్యత్తులో ఆ చిత్రాన్ని తెరమీదకు తీసుకువచ్చే ఆలోచన వుంది అన్నారు.

    విశ్వరూపం-2 గురించి...

    విశ్వరూపం-2 గురించి...


    షూటింగ్ మొత్తం పూర్తయింది. సరైన సమయంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం.

    కిస్సింగ్ సీన్

    కిస్సింగ్ సీన్


    చీకటి రాజ్యం సినిమాలో కిస్సింగ్‌సీన్ పోస్టర్స్‌లో మాత్రం కనిపిస్తోంది. దాన్ని సెన్సార్ వాళ్లు ఏం చేశారో నాకు తెలియదు అన్నారు.

    ఆస్కార్ అవార్డ్

    ఆస్కార్ అవార్డ్


    అమెరికా సినిమా ప్రమాణాలకు అనుగుణంగా ఆస్కార్ అవార్డ్స్ ఇస్తారు. బాలమురళీకృష్ణగారిని గ్రామీ అవార్డ్స్ వాళ్లు ఎలా జడ్జ్ చేయగలుగుతారు? ఆయన భారతీయ సంగీతానికి సేవలు చేశారు కాబట్టి భారతీయులే ఆయన ప్రతిభాపాటవాలేమిటో నిర్ణయించాలి. భారతీయ సినిమాల్ని ఆస్కార్ వాళ్లు ఎలా జడ్జ్ చేయగలుగుతారు? ఉలవచారు ఎలా వుందో ఇండియన్స్ మాత్రమే చెప్పగలరు. హాలీవుడ్ వాళ్లు చెప్పలేరు కదా? ఇండియన్ పొలిటీషియన్ అమెరికా ప్రెసిడెంట్ కావాలని ఆశ పడటంలో అర్థం వుందా? అలాగే అమెరికా వాళ్లు ఇచ్చే ఆస్కార్ అవార్డ్స్ మనకు రావడం లేదని ప్రశ్నించుకోవడంలో అర్థంలేదు.

    దేశంలో పెరుగుతున్న మత అసహనానికి వ్యతిరేకంగా అవార్డుల్ని వాపస్ ఇవ్వడంపై...

    దేశంలో పెరుగుతున్న మత అసహనానికి వ్యతిరేకంగా అవార్డుల్ని వాపస్ ఇవ్వడంపై...


    అవార్డును తిరిగి ఇవ్వొచ్చు. డబ్బును తిరిగి ఇవ్వమంటే కష్టంగా వుంటుంది. అవార్డ్స్‌ను తిరిగి ఇచ్చేవారు డబ్బును కూడా తిరిగి ఇవ్వాలి. అప్పుడే నేను వారిని గౌరవిస్తాను. అవార్డు అనేది ఓ ప్రతీకలాంటిది. ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా ఎంతో ప్రేమగా అందించిన అవార్డును తిరిగి ఇచ్చేయడం సబబు కాదు. ఒకవేళ నాకు సినీ పరిశ్రమ మీద ఏ కారణం చేతనైనా కోపమొస్తే సినిమాల్లో సంపాదించిన డబ్బును తిరిగి ఇచ్చేయలేను కదా? నాకు అవార్డుల్ని తిరిగి ఇచ్చేసే ఉద్ధేశ్యం లేదు. భిన్న నేపథ్యమున్న సంస్థలు, వ్యక్తులు అవార్డుల్ని నిర్ణయిస్తారు. అవార్డుల ఎంపికలో ఏమాత్రం సంబంధం లేని ఏవో కొన్ని రాజకీయ, స్వతంత్ర సంస్థలు తప్పులు చేస్తున్నాయని మనం పొందిన అవార్డుల్ని ఎందుకు తిరిగివ్వాలి? అన్నారు.

    English summary
    Kamal Hasaan interview about Cheekati Rajyam and other issues.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X