'19 స్టెప్స్ 'లో కమల్

ఇక ఈ చిత్రం కథ కేరళ నేపథ్యంలో జర్గుతుంది.పేరొందిన కమల్ కళాయిపట్టు యోధుడు గా కనిపిస్తారు.ఆయన దగ్గరకు జపాన్ నుండి ఓ యువకుడు విద్య నేర్చుకోవటానికి వస్తాడు.అక్కడనుండి కథ మలుపు తిర్గుతుంది.అసిన్ అక్కడ మార్షల్ ఆర్ట్స్ నిపుణురాలు గా కనిపిస్తుంది. ప్రముఖ మళయాళ రచయిత టి.వాసుదేవన్ నాయర్ రాసిన కథ ఆధారంగా ఈ సినిమా స్క్రప్టు ని ఆగ్లంలో రెడీ చేసారు.
పీరియడ్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కలైపట్టు కళ(మర్మ కళ ) లోతులను,మూలాలను పట్టుకునే ప్రయత్నంచేస్తుందిట.దాదాపు యాభై మిలియన్స్ దాకా బడ్జెట్ పెడుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా 2009 చివరలో ప్రారంభం కానుంది.హిందీ,తమిళ,తెలుగు,జపనీస్,ఆంగ్ల భాషల్లో ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాను రూపొందిస్తున్నారు.ఎ.ఆర్.రహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించటానికి ముందుకు వచ్చారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











