‘సాగర సంగమం’గుర్తు చేస్తున్న... విశ్వరూపం’

By Bojja Kumar

కమల్‌ హాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'విశ్వరూపం' వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. కమల్‌హాసన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు 150 కోట్ల భారీ వ్యయంతో అడ్వంచరస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. హాలీవుడ్ సాంకేతిక నిపుణులు ఈ సినిమా కోసం పనిచేస్తున్నారు.

తాజాగా విడుదలైన ఈ చిత్రం థియేటర్ ట్రైలర్...కమల్ హాసన్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'సాగర సంగమం'చిత్రాన్ని గుర్తు చేస్తోంది. ఆ చిత్రంలో మాదిర కమల్ ఇందులో క్లాసికల్ డాన్స్‌తో చేశారు. చాలా రోజుల తర్వాత కమల్ నాట్యం చూడటంతో అభిమానుల్లో సినిమాపై అంచనాలు పెరిగాయి.

సినిమా కథ విషయానికొస్తే...న్యూజెర్సీలో నివసించే హీరో విశ్వనాథ్ ఓ నాట్యకారుడు. పెళ్లిచేసుకొని ఆనందకరమై వైవాహిక జీవితాన్ని అనుభవిస్తుంటాడు. అంతలోనే అతని భార్య అతని నుంచి విడాకులు కోరుకుంటుంది. విడాకుల కోసం ఆమెకు సరైన కారణాలు దొరకవు. దీంతో భర్తలో ఏదో ఒక తప్పును తెలుసుకోవాలనుకుంటుంది. అందుకు ఓ డిటెక్టివ్‌ను నియమిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేదే చిత్ర కథాంశం.

టెర్రరిజం నేపథ్యంలో అత్యున్నత సాంకేతిక విలువలతో ఈ చిత్రం తెరకెక్కింది. అధిక భాగాన్ని అమెరికాలో చిత్రీకరించారు. ఇటీవల సింగపూర్‌లో జరిగిన చిత్రోత్సవంలో కమల్‌హాసన్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ ట్రైలర్స్‌ను విడుదల చేశారు. పూజా కుమార్, రాహుల్‌బోస్, ఆండ్రియా జర్మయ్, జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్రల్ని పోషించారు. శంకర్-ఎహసాన్-లాయ్ సంగీతాన్నందించారు. భారతీయ సినీ చరిత్రలోనే అత్యధిక బడ్జెట్‌తో 'విశ్వరూపం' రూపొందుతోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X