అలాగే నేర్చుకుని ఎదిగా: కమల్ హాసన్
''ఒక సినిమాను తెరకెక్కించాలనుకొన్నప్పుడు దాని గురించి కొన్ని వేలసార్లు చర్చలు జరిగేవి. దర్శకుడు, నటీనటులు దగ్గర నుంచి సాంకేతికవర్గం వరకూ అందరం కలిసి సుదీర్ఘంగా మాట్లాడుకొనేవాళ్లం. ఎల్వీప్రసాద్‌లాంటి గొప్ప వ్యక్తులతో కలిసి నా ప్రయాణం అలా సాగడంతోనే నేను ఎంతో నేర్చుకొన్నాను. అప్పట్లో నేర్చుకొన్నదానితోనే ఈ స్థాయికి చేరాను'' అన్నారు కమల్‌హాసన్.అరవింద్‌కృష్ణ, సుప్రియా శైలజ జంటగా రాజ్ మాదిరాజు దర్శకత్వంలో రమేష్‌ప్రసాద్ నిర్మించిన చిత్రం 'ఋషి'. స్నిగ్థ, డాన్‌చంద్ర సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. కమల్‌హాసన్ ఆడియోను ఆవిష్కరించి, తొలి ప్రతిని డి.రామానాయుడుకి అందించారు. ఈ సందర్భంగా కమల్ పై విధంగా స్పందించారు. అలాగే..మూడు దశాబ్దాల తర్వాత ప్రసాద్ ప్రొడక్షన్స్‌వారు సినిమా తీస్తున్నారు అనగానే... నన్ను హీరోగా పిలుస్తారనుకున్నాను. కానీ వేరే హీరోతో సినిమా చేసి నన్ను ఆడియో వేడుకకు అతిథిగా పిలిచారు (నవ్వుతూ). ఈ సంస్థతో నాది ప్రత్యేకమైన అనుబంధం.
ఈ సంస్థ నిర్మించిన 'ఏక్ దుజేకేలియే' ద్వారానే నేను బాలీవుడ్‌కి పరిచయం అయ్యాను. ప్రసాద్ సంస్థ సినిమాలను తేలిగ్గా తీసుకోదు. ప్రతి చిన్న విషయాన్నీ ఎంతో క్షుణ్ణంగా పరిశీలించి చేస్తారు. నేను నటించిన ఒక సినిమాలో ఎల్వీ ప్రసాద్‌గారిని నటించమని అడిగాను. నేనా? అని, 'స్క్రిప్ట్ రైటర్ రాస్తే చేస్తా' అన్నారు. ఆ విధంగా నా సినిమా అమావస్య చంద్రుడు లో ఆయన నటించారు. ఇక సుదీర్ఘ విరామం తర్వాత ప్రసాద్ సంస్థ నుంచి వస్తున్న ఈ చిత్రం ఘన విజయం సాధించాలి అన్నారు.


Click it and Unblock the Notifications











