For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  వైవిధ్య పాత్రల సృష్టికర్త... కమల్ (ఫోటో పీచర్)

  By Srikanya
  |

  హైదరాబాద్: వెండితెరపై పాత్రల్ని అద్భుతంగా పండించే నటులుంటారు. అయితే పాత్రల్ని సృష్టించే నటులు మాత్రం అరుదుగానే ఉంటారు. ఇండియన్ సినిమా ఖ్యాతిని ఖండాలు దాటించిన కమల్‌ హాసన్‌ రెండో కోవకు చెందుతారు. మరగుజ్జు, మానసిక వికలాంగుడు, సైకో ప్రేమికుడు అంటూ కొత్త వేషధారణలు పరిచయం చేశారు. భారతీయ వెండితెరపై తనదైన ముద్ర వేసిన కమల్‌ హాసన్‌ పుట్టినరోజు బుధవారం. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ....

  కమల్‌ హాసన్‌ 1954 నవంబరు 7న రామనాథపురం జిల్లాలోని పరమకుడిలో శ్రీనివాసన్‌-రాజ్యలక్ష్మి దంపతులకు మూడో సంతానంగా జన్మించారు. కమల్‌ తండ్రి శ్రీనివాసన్‌ స్నేహానికి అత్యంత విలువ ఇచ్చే వ్యక్తి. ఆ రోజుల్లో హిందూ, ముస్లిం కట్టుబాట్లు ఎక్కువగా ఉన్నా తన ప్రాణమిత్రుడి (ముస్లిం)కి విలువ ఇస్తూ, తమ స్నేహానికి గుర్తుగా తన ముగ్గురు కుమారుల పేర్లకు చివర్లో హాసన్‌ చేర్చి చారుహాసన్‌, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌ అని పేర్లు పెట్టారు.

  కమల్‌ హాసన్‌ తన ఆరేళ్ల వయసులో 'కళత్తూరు కన్నమ్మ'లో నటించాడు. 1960 ఆగస్టు 12న విడుదలైంది. జెమినీ గణేశన్‌-సావిత్రి ప్రధానపాత్రధారులు. కమల్‌ చిన్నతనంలోనే వారి కుటుంబం చెన్నైకు వలసరాగా ఆయన విద్యాభ్యాసం నగరంలోని టీ నగర్‌, ట్రిప్లికేన్‌లలో సాగింది.

  కమల్ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళం, హిందీ భాషల్లో నటించారు. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును మూడుమార్లు దక్కించుకున్నారు. 1983లో వచ్చిన మూండ్రాపిరై, 1988లో విడుదలైన నాయగన్‌, 1997లో వచ్చిన ఇందియన్‌ చిత్రాలకు ఈ పురస్కారాలు అందుకున్నారు.

  హిందీలో వచ్చిన సాగర్‌, విరాసత్‌, తెలుగులో సాగర సంగమం, తమిళంలో 16 వయిదినిలే, సిగప్పు రోజాక్కల్‌ తదితర చిత్రాలకు మొత్తం 19 ఫిలింఫేర్‌ అవార్డులు దక్కించుకున్నారు.

  సాగర సంగమం, స్వాతిముత్యం, ఇంద్రుడు చంద్రుడు చిత్రాలకుగాను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నుంచి ఉత్తమ నటుడిగా నంది అవార్డులు సొంతం చేసుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తరఫున ఎనిమిది సార్లు ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు.

  1960లో కళత్తూరు కన్నమ్మ, 1976లో అపూర్వ రాగంగల్‌, 1993లో దేవర్‌మగన్‌, 1994లో మహానది, 1995 నమ్మవర్‌ తదితర కమల్‌ హాసన్‌ చిత్రాలు జాతీయ అవార్డులు దక్కించుకున్నాయి. భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, తమిళనాడు ప్రభుత్వం నుంచి కలైమామణి, చెన్నైలోని సత్యభామ విశ్వవిద్యాలయం తరఫున 'డాక్టరేట్‌' అందుకున్నారు.

  పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు అనే మాట కొందరు నటుల విషయంలో అడపాదడపా వింటూ ఉంటాం. కమల్‌ హాసన్‌ విషయంలో మాత్రం ప్రతి చిత్రానికీ వింటాం. ఎందుకంటే పాత్ర కోసమే పుట్టారు అనిపించేలా జీవం పోస్తారు. 'నాయకుడు', 'సాగరసంగమం', 'గుణ', 'మహానది', 'భారతీయుడు', 'దశావతారం'... ఇలా ఏ చిత్రంలోని పాత్రను తీసుకున్నా - పరకాయ ప్రవేశం అనే మాటకు నిర్వచనంలా ఉంటుంది కమల్‌ నటన.

  బుధవారం కమల్‌ హాసన్‌ జన్మదినం. ఈ సందర్భంగా ఆయన స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'విశ్వరూపం' ప్రచార చిత్రాల్ని విడుదల చేయబోతున్నారు. తొలుత ఈ చిత్రంలోని పాటల్ని ఆవిష్కరించాలని భావించారు. చిత్రాన్ని ఆరో త్రీడీ సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దుతున్నారు. అదే పరిజ్ఞానంతో ప్రచార చిత్రాల్ని సిద్ధం చేశారు.

  English summary
  Kamal Hassan celebrates his 57th birthday on Nov 7th. This multiple National Award winner and mufti-faceted personality has contributed to Indian cinema in ways more than one. Kamal Hassan has been acting since the age of 5. Till now, Kamal is flourishing in his acting career. Experimenting has always been his favourite and that’s why he has entered places where no one dared to go take for e.g. Apoorva Sagodharargal, Avai shanmughi, Indian, Dasavatharam. Kamal sir here is wishing you a long life and hope that you continue to surprise us with all your brilliance.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more