తెలంగాణ శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్!
ప్రస్తుతం విశ్వరూపం-2 చిత్రం షూటింగులో బిజీగా ఉన్న కమల్ హాసన్ ఆ సినిమా తర్వాత ఎన్.శంకర్ సినిమాకు డేట్స్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కమల్ హాసన్ చివరిసారిగా తెలుగులో 'ఈనాడు' చిత్రంలో నటించారు. ఆ తర్వాత ఆయన డైరెక్టు తెలుగు సినిమాలేవీ చేయలేదు.
కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న విశ్వరూపం-2 సినిమా విషయానికొస్తే, విశ్వరూపం-2 చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కమల్ హాసన్.....ఎవరితో పోటీ పడకుండా సింగిల్‌గా వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు. తొలుత దీపావళికి విడుదల చేయాలనుకున్నారు కానీ... అదే సమయంలో అజిత్ నటించిన 'ఆరంభం' చిత్రం కూడా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు ముందు గానీ, తర్వాతగానీ విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అంటే నవంబర్లో కానీ, డిసెంబర్లో కానీ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్నమాట. ఎక్కువ స్క్రీన్లలో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారట.
విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. 'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.


Click it and Unblock the Notifications












