సిగ్గుచేటు, గుండె నిబ్బరం నేర్చుకున్నా: రాజమౌళి
హైదరాబాద్: 'విశ్వరూపం' చిత్రం విజయవంతంగా ప్రదర్శితం అవతున్న నేపథ్యంతో పాటు, విశ్వరూపంపై బ్యాన్ విధించిన నప్పుడు తనకు మద్దతుగా నిలిచిన టాలీవుడ్ సినీ కళాకారులకు కృతజ్ఞతలు తెలపడానికి కమల్ హాసన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు రాజమౌళి తనదైన రీతిలో స్పందించారు. నటన, దర్శకత్వం గురించి నేర్పించిన కమల్ ఇప్పుడు.... కష్టాల్లో ఉన్నప్పుడు గుండె నిబ్బరంతో ఎలా ఉండాలో ఇప్పుడు నేర్పించారని చెప్పుకొచ్చారు.
ఎలాంటి తప్పు లేకుండా 'విశ్వరూపం' లాంటి గొప్ప చిత్రానికి ఇన్ని అవాంతరాలు ఏర్పడటం నిజంగా మనందరం సిగ్గుపడాల్సిన విషయం. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక వాక్ స్వాతంత్రాన్ని కాదని విశ్వరూపం చిత్రానికి అడ్డంకులు సృష్టించారు. దీని వెనక రాజకీయ, వ్యక్తి గత కారణాలు తప్ప మరేమీ లేవని రాజమౌళి పేర్కొన్నారు.
తమిళనాడు నన్ను వద్దనుకుంది అని కమల్ హాసన్ కంటపడి పెట్టడం బాధాకరం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కాకూడదనే భావన వ్యక్తం చేసారు రాజమౌళి. ఎ.రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ... మా ఫాదర్ టైం నుంచి కమల్ హాసన్ తో అనుబంధం ఉంది. ఆయన కమిట్ మెంట్, డెడికేషన్, నాలెడ్జ్ ఉన్న నటుడు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications











