కమల్ సినిమా స్పూర్తితోనే 'కిల్‌బిల్‌' తీసాను

By Srikanya

మన ఇండియన్ యాక్షన్ సినిమాల్లో చాలా చిత్రాలకు 'కిల్‌బిల్‌'స్పూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే 'కిల్‌బిల్‌' చిత్రానికి ఓ ఇండియన్ సినిమా స్పూర్తిగా నిలిచిందంటే ఆశ్చర్యపోతాం. 2001లో కమల్‌హాసన్‌ హీరోగా నటించిన చిత్రం 'అభయ్‌'. వరుసగా హత్యలు చేసే సైకో కథ ఇది. దీంట్లోని కొన్ని సన్నివేశాలను దర్శకుడు క్వింటిన్‌ టొరంటినో స్ఫూర్తిగా తీసుకొన్నారు. ఈ విషయాన్ని ఓ విమర్శకుడి ద్వారా బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తెలుసుకొన్నారు.

ఇటీవల వెనీస్‌లో క్వింటిన్‌ని కలిసినప్పుడు కశ్యప్‌ ఆ విషయాన్ని ప్రస్తావించారు. క్వింటిన్‌ కూడా నిజమే అని సమాధానమిచ్చారు. ఈ విషయమై అనురాగ కశ్యప్‌ మాట్లాడుతూ ''కిల్‌బిల్‌ చేయడానికి ముందు సీరియల్‌ కిల్లర్‌ నేపథ్యంలో వచ్చిన భారతీయ సినిమా'అభయ్‌'ని చూశానని ఆయన తెలిపారు''అన్నారు. 'కిల్‌బిల్‌' చిత్రంలోని కొన్ని సన్నివేశాలకు 'అభయ్‌' చిత్రం స్ఫూర్తిగా నిలవటం ఇప్పుడు అంతటా చర్చనీయాంసమైంది. 'పల్ప్‌ ఫిక్షన్‌', 'కిల్‌బిల్‌', 'ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌' లాంటి చిత్రాలను రూపొందించిన దర్శకుడు క్వింటిన్‌ టొరంటినో.

ప్రస్తుతం కమల్ హాసన్ ...విశ్వరూపం చిత్రం ప్రమోషన్ లో బిజీలో ఉన్నారు. కమల్‌హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. ఈ చిత్రాన్ని రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే నెల 29న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హాలీవుడ్‌ సాంకేతిక నిపుణుల సహకారంతో అమెరికాలో నిర్మాణానంతర కార్యక్రమాల్ని పూర్తి చేశారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు.

ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకీ తీవ్రవాద కార్యకలాపాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న వైనాన్ని చర్చిస్తూనే... వారి పని తీరుని, ఆలోచనల్నీ తన చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. తీవ్రవాదం గురించి కమల్‌ చిత్రంలో ఏం చర్చించారనే విషయాన్ని గోప్యంగా ఉంచారు. తెరపై ఆయన తీవ్రవాదిగా కనిపించబోతున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా విడుదల చేసి కమల్ అందరినీ ఆశ్చర్యపరిచారు. పూజా కుమార్‌, రాహుల్‌ బోస్‌, ఆండ్రియా, జైదీప్‌ అహ్లావత్‌ తదితరులు నటించారు. సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X