Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
విశ్వరూపం-2 షూటింగులో గాయపడ్డ కమల్ హాసన్
కొడైకనాల్ : నటుడు కమల్ హాసన్ తన తాజా సినిమా విశ్వరూపం-2 మూవీ షూటింగులో పాల్గొంటూ గాయపడ్డాడు. తమిళనాడులోని కొడైకనాల్ ప్రాంతంలో సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. వెంటనే అతన్ని ప్రథమ చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
కమల్ హాసన్ స్వీయ నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన 'విశ్వరూపం' చిత్రానికి సీక్వెల్‌గా 'విశ్వరూపం-2' వస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల చేసారు. విశ్వరూపం చిత్రం భారీ విజయం సాధించడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి.
'విశ్వరూపం' చిత్రం పలు వివాదాలకు కేంద్రబిందువైంది. అయితే దర్శకుడిగా కమల్ ప్రతిభ విమర్శకుల్ని మెప్పించింది. విశ్వరూపం-2 చిత్రం ప్రొడక్షన్ వర్క్ ప్రస్తుతం చివరి దశలో ఉంది. సినిమాను దీపావళికి విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటి విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. తాజాగా విడుదలైన రెండో ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోం
విశ్వరూపం'-2 చిత్రాన్ని ఆస్కార్ వి.రవిచంద్రన్ నిర్మిస్తున్నారు. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం.
ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్ తెలిపారు. ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.
కమల్ చెన్నైలో ఇటీవల మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.