ఇక....లైవ్ షోలతో దేవిశ్రీ ప్రసాద్ హల్ చల్ (ఫోటోలు)
హైదరాబాద్: సౌతిండియన్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ యూఎస్ఏ మరియు కెనడాల్లోని వివిధ నగరాల్లో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడానికి సిద్దమయ్యారు. జులై, ఆగస్టు నెలల్లో వివిధ ప్రాంతాలు పర్యటిస్తూ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు. రేడియో ఖుషితో కలిసి దేవిశ్రీ ప్రసాద్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ షోకు సంబంధించిన ప్రోమోను జులై 2న ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించిన విషయాలను దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. 'యూఎస్ఏ-కెనడా లైవ్ కాన్సెర్ట్‌కు రంగం సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో వెలుతున్నాను' అంటూ ట్వీట్ చేసారు.
ఇందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా దేవిశ్రీ ప్రసాద్ తన ట్విట్టర్ ద్వారా షేర్ చేసారు. స్లైడ్ షోలో ఆ ఫోటోలపై ఓ లుక్కేయండి

కమల్ హాసన్
దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్‌కు సంబంధించిన ప్రోమోను విడుదల చేస్తున్న కమల్ హాసన్

దేవిశ్రీ ప్రసాద్, కమల్ హాసన్
దేవిశ్రీ ప్రసాద్, కమల్ హాసన్ ప్రోమో విడుదల సందర్భంగా ఇలా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ప్రోమో వీక్షిస్తున్న కమల్ హాసన్
దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్ ప్రమోషనల్ ప్రోమోను వీక్షిస్తున్న కమల్ హాసన్.

దేవిశ్రీ ప్రసాద్ టూర్ డీటేల్స్
జులై 6 : అట్లాంటా
జులై 12: సాజ్ జోస్ (తెలుగు షో)
జులై 12: సాన్ జోస్ (తమిళ్ షో)
జులై 19: డల్లాస్
జులై 26: చికాగో
జులై 27: ఫేయిర్ ఫాక్స్
ఆగస్టు 2: న్యూ జెర్సీ
ఆగస్టు 9: టోరంటో

లైవ్ పెర్ఫార్మెన్స్‌లో రీటా
సింగర్ రీటా....కూడా దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి ఈ లైవ్ షోలలో పాల్గొనబోతోంది.

రానినా రెడ్డి
ప్రముఖ సింగర్ రాణినా రెడ్డి కూడా దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

సింగర్ మాలతి
సింగర్స్ మాలతి, నేహ బాసిన్ కూడా దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

సూరజ్ సంతోష్
సింగర్ సూరజ్ సంతోష్ కూడా దేవిశ్రీ ప్రసాద్‌తో కలిసి లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.


Click it and Unblock the Notifications











