వివాదాస్పద ఆధ్యాత్మక గురువు పాత్రలో కమల్ హాసన్?
వివాదాస్పదమైన ఆధ్యాత్మిక గురువు ఓషో గా త్వరలో కమల్ హాసన్ కనిపించే అవకాశం ఉంది. ఈ మేరకు కమల్ తో దర్శకుడు ఆంటానినో ఇప్పటికే చర్చలు జరిపారు. అయితే కమల్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది. అయితే స్క్రిప్టు మొత్తం చదివి నిర్ణయం చెపుతానని కమల్ అన్నారని తెలుస్తోంది. ఆంటానినో లక్షీన్ సుకమెలి కూడా ఓషో సిద్ధాంతాల్ని విశ్వసించే వ్యక్తే. ఇటలీకి చెందిన ఆంటోని గత అయిదు సంవత్సరాలుగా వివిధ ఆశ్రమాల్ని సందర్శించి స్క్రిప్టుని సిద్ధం చేశారు. ఆయన మీడియాతో ఓషో పాత్రకు కమల్ హాసన్ అయితే న్యాయం చేయగలరని ఆంటానినో అన్నారు. ఇక కమల్ అంగీకరించని పక్షంలో సంజయ్ దత్ తో నటింపజేయాలని ప్రయత్నిస్తారని తెలుస్తోంది. ఇక ఓషో ఈ నేలను విడిచి రెండు దశాబ్దాలు కావస్తోంది. ఇప్పటికీ ఆయన ప్రవచనాలకు ప్రభావితులవుతున్నవాళ్లు ఉన్నారు. యోగా సెంటర్లు, ఆశ్రమాల్లో ఆయన చెప్పిన సిద్దాంతాలను ఫాలో అవుతున్నారు.


Click it and Unblock the Notifications











