'విశ్వరూపం' ఒరిజనల్ సెన్సార్ కట్స్ ఇవే

By Srikanya

హైదరాబాద్: కమల్‌ హాసన్‌ నటించి దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం'. తమిళ, హిందీ భాషల్లో రూపొంది తెలుగులోకి డబ్‌ అయింది. రాజ్‌కమల్‌ ఫిలింస్‌ ఇంటర్నేషనల్‌ పతాకాన కమల్‌ హాసన్‌ చంద్ర హాసన్‌ కలసి నిర్మించారు. పూజాకుమార్‌, ఆండ్రియా జెరిమియా, ఉపేంద్ర, రాహుల్‌ బోస్‌, జైదీప్‌ ఆహ్లావట్‌, సమ్రాట్‌ చక్రవర్తి, జరీనా వాహాబ్‌, నాజర్‌ ముఖ్యపాత్రధారులు.

శేఖర్‌ కపూర్‌ అతిథి పాత్ర పోషించారు. ఈ చిత్రాన్ని చూసిన చెన్నై సెన్సార్‌ కార్యాలయం 'ఇసి' 14 కట్స్‌తో 17-10-12న తలిదండ్రుల పర్యవేక్షణలో పిల్లలు చూడాలంటూ 'యుఎ' సర్టిఫికెట్‌ని జారీ చేసింది. విశ్వరూపంకి సంబంధించి డిజిటల్‌ టీజర్‌ 1, వీడియో టీజర్‌ 1, డిజిటల్‌ ట్రయిలర్లు 4, వీడియో ట్రయిలర్లు 14కి కూడా ఇసి సర్టిఫికెట్లు జారీ చేసింది.

ఆ కట్స్ ఏమిటంటే...

1. గుండె దిటవు లేనివారికి ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు దృశ్యాలు సరిపడవు అనే హెచ్చరికను సినిమా ప్రారంభంలో చూపమనగా చూపడం జరిగింది.

2. రెండవ రీలులోను సినిమాలో మరెక్కడైనా గాని ఎ)ఫక్‌, బి) 'మాయితుక్కు' అని పలికిన పదాలు తొలగించమనగా తొలగించి అంగీకారయోగ్యమైన పదాలు ఉంచారు.

3. రెండవ రీలులో హీరో సున్నితభాగంపై ఫరూఖ్‌ కొట్టే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమనగా అది తొలగించి, అంతే నిడివిగల అంతకు ముందు దృశ్యంలోని భాగానికి అదనంగా జోడించారు.

4. మూడవ రీలులో ఫరూఖ్‌ యొక్క 'రిస్ట్‌'ని నరికే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమనగా అది తొలగించి అంగీకారయోగ్యమైన వేరే దృశ్యాన్ని వుంచారు.

5. నాలుగవ రీలులో వెనుక భాగం కాలిపోగా నడుస్తూన్న దృశ్యం నిడివి తగ్గించమనగా తొలగించి, అంగీకరింపబడిన అంతే నిడివిగల వేరే దృశ్యాన్ని ఉంచారు.

6. నాలుగవరీలులో ఒమర్‌ పలికిన 'మైరావడు' పదాన్ని తొలగించమనగా, అంగీకరింపబడిన అంతే నిడివిగల పదాన్ని జోడించారు.

7. అయిదువ రీలులో అమెరికన్‌ యొక్క గొంతును ముక్కలుగా నరికే దృశ్యాన్ని ఫ్లాష్‌లా చూపమనగా తొలగించి, అంగీకారయోగ్యమైన అంతే నిడివిగల దృశ్యాన్ని వుంచారు.

8. అయిదవ రీలులోను, సినిమాలో మరెక్కడైనా గాని పలికిన 'మాదర్‌చూద్‌' పదం వినబడ కూడదనగా వినరాకుండా చేసారు.

9. ఆరవ రీలులో జుత్తు కత్తెరిస్తున్నట్టుగా అబ్బాసిపై చిత్రీకరించిన దృశ్యాలను 40 శాతం తగ్గించమనగా, తగ్గించి అంగీకరింపబడిన దృశ్యాలను ఉంచారు.

10. ఏడవరీలులో గాని, సినిమాలో మరెక్కడైనాగాని 'బాస్టర్డ్‌' అనే అర్థం వచ్చే అరబిక్‌ పదం వినరాకూడదనగా శబ్దం వినబడకుండా చేసారు.

11. ఎనిమిదవ రీలులోగాని, సినిమాలో మరెక్కడైనా గాని 'యాస్‌, బిచ్‌' పదాలు వినరాకూడదనగా వినబడకుండా చేసారు.

12. ఎనిమిదవ రీలులో యాంటిక్‌ షాప్‌ యజమానిని చంపే దృశ్యాలను 30 శాతం తగ్గించమనగా తొలగించి అంగీక రించిన అంతే నిడివిగల సరైన దృశ్యాలను ఉంచారు.

13. ఎనిమిదవ రీలులో జాన్‌ని స్ట్రాంగ్యులేట్‌ చేసే దృశ్యాన్ని 30 శాతం తగ్గించమనగా అంతే నిడివిగల అంగీకారయోగ్యమైన సరైన దృశ్యాన్ని కలిపారు.

14. ఒక వ్యక్తిని ముక్కలుగా నరికే దృశ్యాన్ని 30 శాతం తగ్గించమనడంతో అంతే నిడివిగల అంగీకారయోగ్యమైన సరైన దృశ్యాన్ని జోడించారు.

2గం|| 28 ని|| 23 సె|| వ్యవధితో ప్రదర్శితమయ్యేలా రూపొందిన 'విశ్వరూపం' తెలుగులో 25-1-13న విడుదలైంది.

కమల్‌ హాసన్‌ దర్శకత్వం వహిస్తూ నటిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. రాజ్‌ కమల్‌ ఫిలిమ్స్‌ ఇంటర్నేషనల్‌, పి.వి.పి. సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు 14 కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రాన్ని సెన్సార్ సర్టిఫికెట్‌కు అప్లై చేయగా సెన్సార్ బృందం చాలా సేపు సమాలోచనలు జరిపి కొన్ని సన్నివేశాలను కట్ చేయాలని చెప్పారు. వాటిలో కొన్ని సన్నివేశ సందర్భాలకు కమల్ విపులంగా వివరణ ఇవ్వడంతో తృప్తి చెందిన సెన్సార్ బృందం చివరికి 14 కట్స్‌తో యు/ఎ సర్టిఫికెట్‌ను ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X