For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వర్మ ఆఫర్ రిజెక్టు చేసిన కమల్ హాసన్

    By Srikanya
    |

    ముంబై: తాజాగా రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ఆఫర్ ని కమల్ హాసన్ రిజెక్టు చేసారు. ఆయన దర్శకత్వంలో '26/11' అనే చిత్రం రూపొందబోతోంది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల్లోనే ఆయన నిమగ్నమై ఉన్నారు. ఈ చిత్ర కథలో ఉగ్రవాద నిరోధక సంస్థ ఉన్నతాధికారి పాత్ర కీలకం. ఇది రాకేష్‌ మారియా అనే ఐపీఎస్‌ అధికారి జీవితానికి దగ్గరగా ఉంటుందని బాలీవుడ్‌ సమాచారం. ఆ పాత్ర కోసం కమల్‌హాసన్‌నీ దర్శకుడు సంప్రదించారు. అయితే ఆయన రిజెక్టు చేసారని సమాచారం.

    తర్వాత సంజయ్‌ దత్‌నీ అనుకున్నారు కానీ డిపార్టమెంట్ చిత్రం డిజాస్టర్ కావటంతో సంజూ సైతం వర్మ ప్రాజెక్టుపై ఆసక్తి చూపలేదు. దాంతో ఆ పోలీసు పాత్రను నానాపటేకర్‌ పోషిస్తున్నారు. నానా గతంలో వర్మ రూపొందించిన 'అబ్‌ తక్‌ చప్పన్‌'లో నటించారు. ముంబై లో 2008 నవంబరు 26న జరిగిన ఉగ్రవాద దాడులను కథగా మలచుకొన్నారు రామ్‌గోపాల్‌ వర్మ.డు '26/11' చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి.

    English summary
    According to the industry buzz, Nana Patekar, who is making a comeback after eight years with Ram Gopal Varma's Ab Tak Chhappan sequel, is also teaming with the filmmaker for his next. Apparently, RGV has roped in Nana to play Rakesh Maria in his next based on the 26/11 attacks in Mumbai. According to the reports, RGV had also approached, Sanjay Dutt and Kamal Haasan for the same role.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X