దాడి ఘటనపై మౌనం వీడిన శృతి హాసన్ తల్లి

By Bojja Kumar

ముంబై: శృతి హాసన్ ఒంటరిగా నివాసం ఉంటున్న అపార్టుమెంటులోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి దాడి చేసే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన గురించి మీడియా ద్వారా దేశ వ్యాప్తంగా గంటల్లోనే పాకి పోయింది. అయితే ఈ ఘటనపై శృతి హాసన్ తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక మౌనం వహించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కన్న కూతురి విషయంలో ఇంత సీరియస్ ఘటన జరిగినా వారు సరైన సమయంలో, ఊహించిన స్థాయిలో స్పందించ లేదు.

ఇటీవల కమల్ హాసన్ స్పందించగా, ఎట్టకేలకు శృతి హాసన్ తల్లి సారిక(కమల్ హాసన్ మాజీ భార్య) మౌనం వీడారు. ఇది అనుకోకుండా జరిగిన సంఘటన అని, ఇలాంటి ఎదురైనప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు. ఈ విషయమై ఆమె ఒక ఆంగ్లపత్రికతో మాట్లాడుతూ...'ప్రస్తుత రోజుల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి. శృతి గురించి నా మనసు ఎప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఇలాంటి సంఘటనలను ఎదురించడం నేర్చుకోవాలి' అని తెలిపారు.

Kamal Hassan's Ex-Wife Breaks Silence Over Stalker's Attack On Shruti

ఇలాంటి పరిస్థితుల్లో శృతి ఒంటరిగా కాకుండా పేరెంట్స్ దగ్గర ఉంటే బాగుంటుంది అని అంతా అభిప్రాయ పడుతున్నారు. దీనిపై సారిక స్పందిస్తూ 'ప్రస్తుతం ఆమె నా దగ్గర ఉండ లేదు. ఎందుకంటే శృతి తన దృష్టంతా కెరీర్‌పైనే పెట్టింది. షూటింగుల నిమిత్తం వివిధ ప్రాంతాల్లో తిరగాల్సి వస్తుంది. పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటారు. అయితే జాగ్రత్తగా ఉండాలని సూచనలు ఇస్తుంటారం. అంతే కానీ వారిని బలవంతంగా తమ వద్ద ఉండేట్లు మాత్రం చేయలేం' అని సారిక వ్యాఖ్యానించారు.

కాగా...సిసి టీవీ పుటేజ్ ఆధారంగా పోలీసులు శృతి హాసన్‌పై దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసారు. నిందితుడు అశోక్ శంకర్ త్రిముఖే(45)గా గుర్తించారు. అతడు ఫిల్మ్ సిటీలో స్పాట్ బాయ్‌గా పని చేస్తున్నట్లు గుర్తించారు. తాను సోదరుడికి ఉద్యోగం కోసం శృతి హాసన్ ఇంటికి వెళ్లాలని.. తాను చెప్పడానికి ప్రయత్నిస్తుండగానే ఆమె డోర్ వేసేశారని అశోక్ శంకర్ పోలీసులకు చెప్పాడు. అంతేకానీ, ఆమెను బెదిరించాలన్నది తన ఉద్దేశం కాదని చెప్పాడు. అయితే అశోక్ శంకర్ త్రిముఖే వాదనను శృతి హాసన్ ఖండించారు.

పోలీసులకు అశోక్ శంకర్ త్రిముఖే చెప్పేది అవాస్తవమని, ఒంటరిగా ఒక ఆడపిల్ల ఉంటున్న పార్టుమెంటులోకి రాత్రి 9.30 గంటలకు రావాల్సిన అవసరం ఏమిటని ఆమె ప్రశ్నించారు. అతడు అనేక సందర్భాల్లో సినిమా సెట్లలో కనిపించాడని, అప్పుడెప్పుడూ తనతోగానీ, తన సిబ్బందితో గానీ అతని సోదరుడి ఉద్యోగం గురించి ఎందుకు మాట్లాడలేదని, దురుద్దేశంతోనే తన ప్లాటుకు వచ్చాడనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలనే విధంగా శృతి హాసన్ స్పందించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X