twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కుళ్లు రాజకీయాలు: షారుక్, కమల్ చేసిన తప్పేమిటి?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: రాను రాను దేశంలో సినిమా వాళ్లపై వివాదాలు పెరిగి పోతున్నాయి. మతం, కులం, ప్రాంతం ఇలా ఏదో ఒక వివాదాన్ని రేకెత్తించి సినిమాలను అడ్డుకోవడం ఈ మధ్య ఫ్యాషన్‌గా మారింది. విశ్వరూపం చిత్రంతో పాటు ఇటీవల పలు సినిమాల విషయంలో జరిగిన రాద్దాంతాలు, గొడవలు పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. ఇందులో కొన్నింటి వెనక రాజకీయ నాయకులు హస్తం ఉండటం గమనార్హం.

    ఇటీవల కాలంలో జరిగిన కొన్ని సినిమాల గొడవల విషయం తీసుకున్నా.... తాజాగా కమల్ హాసన్ విశ్వరూపం సంఘటనలను పరిశీలించినా, షారుక్ ఖాన్ వ్యవహారం ఆరా తీసినా ఈ వివాదాల వెనక కొందరు స్వార్థ రాజకీయ నాయకుల హస్తం ఉందని ఇట్టే అర్థం అవుతుందనే అభిప్రాయం సినీ అభిమానుల్లో వ్యక్తం అవుతోంది.

    విశ్వరూపం వివాదం పరిశీలిస్తే...100 కోట్ల ఖర్చుతో కమల్ హాసన్ తన ఆస్తులన్నీ తాకట్టు పెట్టి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ నెల 25నే ఈ చిత్రం విడుదల కావాల్సి ఉండగా మత పరమైన ఆందోళనతో తమిళనాడులో ఈ సినిమా ఆగి పోయింది. పైకి ఇది ఓ మతం గొడవలా కనిపిస్తున్నా తెర వెనక రాజకీయ హస్తం ఉందని మీడియా టాక్. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కావానే కమల్ హాసన్ పై కక్ష సాధిస్తోందనే విమర్శ వినిపిస్తోంది. విశ్వరూపం శాటిలైట్ రైట్స్ కమల్ హాసన్ జయ టివికి అమ్మారు. అనంతరం డీటీహెచ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని సినిమాను టీవీల్లో కూడా నేరుగా విడుదల చేసేందుకు ప్లాన్ చేసారు. దీంతో ముఖ్యమంత్రి జయలలితకు కోపం వచ్చింది. మాకు శాటిలైట్ రైట్స్ అమ్మి మా అనుమతి లేకుండా మళ్లీ సినిమాను టీవీల్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తావా? అంటూ కక్షసాధింపు మొదలు పెట్టిందట. పంచె కట్టిన తమిళుడు ప్రధానిగా రావాలని కమల్ హాసన్ వ్యాఖ్యలు కూడా జయలలిత కోపానికి మరో కారణం అయిందని అందుకే కమల్ 'విశ్వరూపం'పై ప్రతీకారం తీర్చుకుంటోందని అంటున్నారు.

    షారుక్ ఖాన్ వివాదాన్ని పరిశీలిస్తే.... ఔట్ లుక్ అనే మేగజైన్లో షారుక్ వ్యాఖ్యానిస్తూ తన పేరు చివరన ఖాన్ అని ఉండటం వల్ల కొన్ని సార్లు ఇబ్బంది పడ్డానని, అమెరికా విమానాశ్రయంలో తనను గుచ్చిగుచ్చి ప్రశ్నించారని, తన తండ్రి భారత దేశ స్వాతంత్రం కోసం పోరాడినా తనను కొందరు పొరుగుదేశం వాడిగానే చూసారని, పాకిస్థాన్ వెళ్లి పోవాలని ర్యాలీలు సైతం చేసారని చెప్పుకొచ్చారు. షారుక్ ను పొరుగుదేశం వాడిగా చూడటం, పాకిస్థాన్ వెళ్లాలని ర్యాలీలు చేయడం వెనక రాజకీయ నాయకుల కుట్ర ఉందనేది విస్పష్టం. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో లష్కరే తోయిబా హఫీజ్ సయీద్ షారుక్ ను భారత్ లో భద్రత లేకుంటే పాకిస్థాన్ రావాలని ఆహ్వానించాడు. హఫీజ్ వ్యాఖ్యలపై షారుక్ ఘాటుగానే స్పందించారు. తనకు భారత్ లో భద్రతకు సంబంధించి ఎలాంటి ఇబ్బంది లేదని, నీ ఉచిత సలహాలు తనకొద్దని కౌంటర్ ఇచ్చాడు. తను ఔట్ లుక్‌తో చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పరిణామాలకు దారిస్తుందని అనుకోలేదని షారుక్ మనోవేదనకు గురయ్యాడు.

    English summary
    Political game behind Kamal Hassan's Viswaroopam issues. Kamal Hassan unhappy over political play on Viswaroopam. Caught between the political tussle, Shahrukh Khan said it was ironical that people were reacting to his article without even reading it. The controversy stemmed from the actor's remarks that he sometimes becomes an inadvertent object of political leaders who choose to make him a symbol of all that they think is wrong and unpatriotic about Muslims in India.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X