కమల్ చేస్తున్న హాలీవుడ్ చిత్రం టైటిల్ ఇదే

By Srikanya

హైదరాబాద్: కమల్ హాసన్ త్వరలో ఓ హాలీవుడ్ చిత్రం చేయబోతున్నారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్ నిర్మాత బ్యారీ అబ్స్ బోర్న్ తో కలిసి కమల్ ఈ చిత్రం చేయనున్నారు. కమల్ దర్శకత్వం వహించి నిర్మించిన విశ్వ రూపం చిత్రం చూసి ఆయనతో చిత్రం చేయటానికి ముందుకు వచ్చారు. ఈ చిత్రం టైటిల్ 'All are Kin'...అంటే తెలుగులో అంతా మనవాళ్లే అని. ఈ చిత్రం భారతీయ సంస్కృతి,చరిత్రను ఉద్దేశించి ఉంటుంది. ఈ చిత్రానికి కమల్ కి మంచి రెమ్యునేషన్ ముట్టనున్నదని తెలుస్తోంది.

గతంలో సింగపూర్‌లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్నప్పుడే కమల్ ఈ విషయం వెల్లడించారు. అప్పుడు కమల్ మాట్లాడుతూ... తాను హాలీవుడ్ చిత్రానికి కథ రాస్తున్నానని వివరించారు. ఆ చిత్రంలో తానే హీరోగా నటిస్తానన్నారు. తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన తమిళ సినిమాకు ఎప్పుడూ రుణపడి వుంటానన్నారు. హాలీవుడ్‌లో నటించేందుకు వచ్చిన అవకాశంపై ఒప్పందం కుదుర్చుకునేందుకే సింగపూర్ వెళ్లానన్నారు. తాను ఆస్కార్ అవార్డు కోసం హాలీవుడ్‌లో నటించడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
హాలీవుడ్‌లోనే వుండిపోనని, ఎప్పటిలానే అన్ని భాషాల్లో నటిస్తానని పేర్కొన్నారు. హాలీవుడ్ సినిమాకు ఇంకా పేరు ఖరారు చేయలేదని, ఆ సినిమాను నిర్మాత బెర్రీ యాస్బెన్ రూపొందిస్తున్నారని కమల్ వివరించారు.

రీసెంట్ గా విశ్వరూపం చిత్రం వరల్డ్ ప్రీమియర్ షోను లాస్ ఏంజిల్స్‌లోని పసిఫిక్ థియేటర్లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి బార్రీ ఒస్బోర్న్ తో పాటు పలువురు హాలీవుడ్ ప్రముఖులు, చిత్ర తారాగణం కమల్ హాసన్, పూజా కుమార్, ఆండ్రియా, శేఖర్ కపూర్, సామ్రాట్ తదితరులు హాజరయ్యారు

ఇక పోతే...విశ్వరూపం చిత్రం అన్ని అడ్డంకులను తొలగించుకుని తమిళనాడుతో పాటు దేశ వ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితం అవుతోంది. తాజాగా ఈచిత్రం కలెక్షన్స్ రూ. 100 కోట్లు దాటాయి. ఈ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించిన రాహుల్ బోస్ తన ట్విట్టర్ ద్వారా ఈ వియాన్ని వెల్లడించారు. 'తాజాగా అందిన సమాచారం ప్రకారం విశ్వరూపం చిత్రం ఇండియాలో రూ. 120 కోట్లు వసూలు చేసింది. నేను నటించిన సినిమాల్లో 100 కోట్లు క్రాసైన సినిమా ఇదే. కమల్ హాసన్ తో పాటు విశ్వరూపం సినిమా టీం మొత్తానికి అభినందనలు' అంటూ రాహుల్ బోస్ ట్వీట్ చేసారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X