»   » యంగ్ హీరో కమల్ కామరాజు వివాహం

యంగ్ హీరో కమల్ కామరాజు వివాహం

Posted By:
Subscribe to Filmibeat Telugu
Kamal Kamaraju
హైదరాబాద్: ఆవకాయ బిర్యాని, గోదావరి,కలవరమాయే మదిలో చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ కామరాజు. అతను త్వరలో వివాహం చేసుకుని ఓ ఇంటివాడుకానున్నారు. చెన్నై ఐఐటి గ్రాడ్యుయేట్ సుప్రియను ఆయన వివాహం చేసుకుంటారని తెలుస్తోంది. సుప్రియ ప్రస్తుతం ఓ పేరొందిన మల్టి నేషనల్ కంపెనీలో పనిచేస్తోంది. ఈ సంవత్సరమే ఈ జంట ఒకటి కానుందని సమాచారం.

అలాగే అక్టోబర్ 6న నిశ్చితార్దం జరగనుందని చెప్తున్నారు. అన్ని అనుకూలిస్తే డిసెంబర్ లోనే ముహూర్తం పెడతారు. ఇది ప్రేమ వివాహం కాదని,పెద్దలు కుదిర్చిన పెళ్లి అని తెలుస్తోంది. ఛత్రపతి చిత్రంలో ప్రభాస్ కి స్నేహితుడుగా చేసిన కమల్ తర్వాత అనుకోకుండా ఒక రోజు చిత్రానికి అసెస్టెంట్ డైరక్టర్ గా కూడా చేసారు. త్వరలో కమల్ హీరోగా స్వయంగా ఓ ప్రాజెక్టు చేయనున్నారని వినికిడి.

English summary
Kamal Kamaraju is all set to get married this year. As per the latest reports being heard, Kamal is going to marry a girl named Supriya. Supriya is a graduate of IIT Chennai and she is currently working in a reputed Multi National Company.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu