Don't Miss!
- Finance
Dalit Bandhu: ప్రజలు మెచ్చిన దళితబంధు.. విజయవంతంగా ముందుకు..
- News
నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది ఇందుకే: భగ్గుమన్న బండి సంజయ్
- Sports
WPL 2023: ఫిబ్రవరి 13న మహిళల ఐపీఎల్ వేలం!
- Lifestyle
Women Money Habits: మహిళల ఈ అలవాట్లతో ఉన్నదంతా పోయి బికారీ కావాల్సిందే!
- Technology
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
చెత్తనా కొడుకు సినిమా అలా తీస్తాడా.. జైల్లో పెట్టాలి.. నోరుపారేసుకొన్న కమల్ ఖాన్
బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ మరోసారి నోటి దురుసును బయటపెట్టుకొన్నాడు. రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ నటించిన జగ్గా జాసూస్ చిత్రం శుక్రవారం రిలీజైంది. ఈ చిత్రాన్ని చూస్తూనే నోటికి వచ్చినట్టుగా రాయడానికి వీలులేని విధంగా జగ్గా జాసూస్ నిర్మాత, దర్శకులను బండబూతులు తిట్టాడు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై సానూకూలంగా రివ్యూలు ఇస్తే.. కమల్ ఆర్ ఖాన్ మాత్రం చెండాలంగా ఉంది. చాలా చెత్తగా ఉంది. దారుణంగా ఉంది అంటూ ట్వీట్ల వర్షం కురిపించాడు. ఈ సినిమాపై కమల్ ఆర్ ఖాన్ గురించి ఏం ట్వీట్ చేశారో మీరే చూడండి..
|
ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి
జగ్గా జాసూస్ సినిమా తీసిన వారిపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకోవాలి. వారిని ప్రభుత్వం వారంపాటు జైల్లో పెట్టాలి. నా జీవితంలో చూసిన అతి చెత్త సినిమా జగ్గా జాసూస్. మరోసారి ఇలాంటి చెత్త సినిమాను చూడకపోవచ్చు.
|
కోటి రూపాయలు బహుమానం
జగ్గా జాసూస్ సినిమా కథ ఏంటో చెప్పిన వారికి రూ. 1 కోటి బహుమానం ఇస్తాను. ఈ సినిమా తీసిన చెత్తనా కొడుకు ఐదేళ్ల నుంచి ఏం పీకుతున్నాడు అని నోటికి రాని మాటలతో ట్విట్టర్‌లో విరుచుకుపడ్డాడు.

అమ్మనా బూతులు తిట్టిన..
నా రివ్యూలో నేను సాధారణంగా నేను ఎప్పుడు ఎవరినీ తిట్టను. కానీ జగ్గా జాసూస్ సినిమా తీసిన అమ్మనా బూతులు తిడుతున్నానంటే ఆ సినిమా ఎంత చెత్తగా ఉందో అర్థం చేసుకోండి.
|
ఎంత చెత్తగా ఉందో మాటలు రావడం..
జగ్గా జాసూస్ సినిమా ఎంత చెత్తగా ఉందో చెప్పడానికి మాటలు దొరకడం లేదు. ఇలాంటి సినిమా తీసినందుకు 1 శాతం సిగ్గు ఉన్నా దర్శకుడు అనురాగ్ బసు వెంటనే క్షమాపణ చెప్పి సినిమా రంగం నుంచి తప్పుకోవాలి.

బాలీవుడ్ హిస్టరీలో ఇలాంటి
జాగ్గా జాసూస్ సినిమాకు 5 పాయింట్లకు 10 పాయింట్లు (10/5) ఇస్తాను ఇది సినిమా కాదు. ఓ శాసనం. బాలీవుడ్ హిస్టరీలో ఇలాంటి సినిమా ఇక రాదు అని గేలి చేశాడు. బాలీవుడ్, టాలీవుడ్ సినిమాలపై కమల్ ఆర్ ఖాన్ విరుచుకుపడటం కొత్తేమీ కాదు. గతంలో కూడా పలు సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.

బాహుబలిపై కూడా విమర్శలు
ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందిన బాహుబలి2 సినిమాపై కూడా కమల్ ఖాన్ నోరుపారేసుకొన్నాడు. బాహుబలి సినిమా చాలా చెత్త సినిమా. ఆ సినిమాను చూసి రూ.2 వేలు వృథా చేసుకొన్నాను. ప్రభాస్ ఒంటెలా ఉన్నాడని వివాదాస్పద కామెంట్లు చేశాడు. ఆ తర్వాత తన తప్పు తెలుసుకొని రాజమౌళికి క్షమాపణలు చెప్పాడు.