'కమల్, రజనీ, శంకర్' కాంబినేషన్ పై కమల్ క్లారిఫికేషన్
శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్, రజనీకాంత్ కలిసి నటించబోతున్నారని, అలాగే అ చిత్రానికి బడ్జెట్ దాదాపు రూ.500 కోట్లు అని కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి రూమర్స్ అని కొట్టిపారేశారు కమల్ హాసన్. కమల్ హాసన్ గురువారం హైదరాబాద్ వచ్చారు. ఫిక్కీకి సంబంధించిన సమావేశంలో పాల్గొన్నప్పుడు మీడియావారు ఆ చిత్రం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ఈ విషయం తేలింది. "శంకర్, నేనూ కలిసి ఒకే విమానంలో కలిసి ప్రయాణించాం. ఆయన నాతో కూడా ఏమీ అనలేదే. మీతో చెప్పారా? వావ్ చాలా గ్రేట్" అంటూ నవ్వేశారు. అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం 'రోబో' ఇంకా చూడలేదన్నారు. వీలుంటే ఇపుడే చూస్తానని బదులిచ్చాడు. ఈ మీడియా సమావేశంలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











