అదిరింది : కమల్ 'చీకటి రాజ్యం' ట్రైలర్ (వీడియో)
హైదరాబాద్: కమల్‌హాసన్, త్రిష కలసి నటిస్తున్న చిత్రం 'చీకటిరాజ్యం'.రాజేశ్ ఎం సెల్వ దర్శకుడు. ఎన్.చంద్రహాసన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్ ని ముందు చెప్పినట్లుగానే ఈ రోజు విడుదల చేసారు. ఈ ట్రైలర్ ని ఈ క్రింద చూడండి.
ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై... కమల్ సోదరుడు చంద్రహసన్ నిర్మిస్తున్న చిత్రం చీకటిరాజ్యం. కమల్ వద్ద దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న రాజేశ్.ఎమ్.సెల్వ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మరో కీలకపాత్రలో ప్రకాశ్ రాజ్ నటిస్తుండగా.. గతంలో మన్మథబాణం చిత్రంలో కమల్ తో కలసి నటించిన త్రిష.. మరోసారి ఈ సినిమాలో కమల్ కు జంటగా కనిపించబోతోంది. కిషోర్, సంపత్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
కమల్ మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు. గిబ్రాన్ మంచి సంగీతం అందించాడు''అని తెలిపారు.

నా గురువు బాలచందర్‌గారితో 37 సినిమాలకు కలిసి పని చేశాను. చివరి సినిమా 'ఉత్తమవిలన్' చేశాక ఆయన మరణించారు. ఇప్పుడు ఆయన లక్షణాలు నాలో కొన్ని కనిపిస్తున్నాయి. నా కోపం, నటన అన్నీ బాలచందర్‌గారి నుంచి వచ్చినవే. 'చీకటి రాజ్యం' ఒక విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రం. రెండు గంటలు ఎలా గడిచిపోయాయో తెలియనంతగా ఈ సినిమా చూసిన ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటికొస్తారు. సినిమా అనేది ఎవరి కారణంగా విజయం సాధిస్తుందో చెప్పలేం. 'షోలే'లో అందరికీ గబ్బర్‌సింగ్ పాత్రే గుర్తుంటుంది. అలా ఏ సినిమాతో ఎవరికి గుర్తింపు లభిస్తుందో తెలియది''అన్నారు.
ఈ చిత్రం Sleepless Night (2011) అనే ఫ్రెంచ్ చిత్రం ఆధారంగా రూపొందుతోందని చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. గతంలోనూ కమల్ చిత్రాలు రకరకాల పరభాషా చిత్రాల నుంచి ప్రేరణ పొందినవి కావటంతో ఇదే నిజమే కావచ్చుననే అంటున్నారు.


Click it and Unblock the Notifications











