twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమల్ ఇంటర్వూ: ‘ఉత్తమ విలన్’ కొత్త ఫొటోలతో

    By Srikanya
    |

    హైదరాబాద్: ఇప్పుడు 'ఉత్తమ విలన్‌'తో మరోసారి మంత్రముగ్థుల్ని చేయడానికి వస్తున్నారు. రమేష్‌ అరవింద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల 10న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా కమల్‌ హాసన్‌తో మీడియా ప్రత్యేకంగా సంభాషించింది. రమేశ్‌ అరవింద్‌ దర్శకుడు. కె.బాలచందర్‌, కె.విశ్వనాథ్‌, జైరామ్‌, నాజర్‌, పూజా కుమార్‌, ఆండ్రియా, పార్వతీమీనన్‌, ఊర్వశి కీలక పాత్రధారులు.

    తెలుగులో ఈ సినిమాని సి కళ్యాణ్ రిలీజ్ చేయనున్నాడు. సుమారు 8 కోట్ల రూపాయలకి సి. కళ్యాణ్ ఈ సినిమా తెలుగు రైట్స్ ని సొంతం చేసుకున్నాడు. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ - స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    కమల్‌హాసన్‌ హీరోగా ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ సమర్పిస్తున్న చిత్రం ‘ఉత్తమవిలన్‌' . తిరుపతి బ్రదర్స్‌ ఫిల్మ్‌ మీడియా ప్రై లిమిటెడ్‌, రాజ్‌ కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సి.కల్యాణ్‌ తెలుగులో అందిస్తున్నారు.

    కమల్ హాసన్ ఇప్పటికే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ ని పూర్తి చేసి,తెలుగులో సైతం ప్రమోషన్ మొదలెట్టారు. అందులో భాగంగా చిత్రం ఫొటోలని విడుదల చేసారు. మీరు ఓ లుక్కేయండి.

    స్లైడ్ షోలో ....ఇంటర్వూ..ఫొటోలు

    'ఉత్తమ విలన్‌'లో ఎవరు ఉత్తముడు? ఎవరు విలన్‌?

    'ఉత్తమ విలన్‌'లో ఎవరు ఉత్తముడు? ఎవరు విలన్‌?

    (నవ్వుతూ) ఎవరు ఎవరో తెలుసుకోవడమే జీవితం. పరిస్థితులే ఎవరు విలనో, ఎవరు హీరోనో నిర్ణయిస్తాయి. నీ దృష్టిలో నేనేంటి అనేది అనవసరం. నా దృష్టిలో నేనేంటి అనేదే ముఖ్యం. ఆ పరిస్థితుల నుంచి తప్పించుకొని ఎలా ఉత్తముడిగా నిలవాలన్నదే ఈ కథ.

    ఈ మధ్య కాలంలో వేగంగా పూర్తి చేసిన సినిమా ఇదేనేమో?

    ఈ మధ్య కాలంలో వేగంగా పూర్తి చేసిన సినిమా ఇదేనేమో?

    అలా ఏం లేదండీ. 'విశ్వరూపం' కూడా నేను ఆరు నెలలో పూర్తి చేశా. కానీ వివాదాల వల్ల ఆ సినిమా ఆలస్యమైంది. 'విశ్వరూపం 2' మూడు నెలల్లో ముగించా. కానీ నిర్మాతల వల్లే ఆ చిత్రం ఆలస్యమైంది.

    విభిన్నమైన కథలతో ప్రయాణం... ఎలా ఉందీ అనుభవం?

    విభిన్నమైన కథలతో ప్రయాణం... ఎలా ఉందీ అనుభవం?

    రకరకాల కథల్ని, పాత్రల్ని ఒకేసారి ఆకళింపు చేసుకొని అందులో ప్రవేశించడం నాకు కొత్తేం కాదు. బాలచందర్‌గారి శిష్యరికంలో నేర్చుకొన్న విద్యే. 'మరోచరిత్ర,' 'మన్మథ లీలలు', 'గుప్పెడు మనసులు'.. ఇవన్నీ ఒకే సమయంలో తెరకెక్కిన చిత్రాలు.

    రమేష్‌ అరవింద్‌కు దర్శకత్వ బాధ్యతలు కారణం?

    రమేష్‌ అరవింద్‌కు దర్శకత్వ బాధ్యతలు కారణం?

    రమేష్‌ అరవింద్‌, నేనూ ఒకే స్కూల్లో చదువుకొన్న విద్యార్థుల్లాంటివాళ్లం. నా గురించి తనకు బాగా తెలుసు. ఒక రకంగా నన్ను చదివేశాడు. ఇద్దరి ఆలోచనలూ ఒకేలా ఉంటాయి. అందుకే... ఈ సినిమా ఆయన చేతుల్లో పెట్టా.

    కుదరదు...

    కుదరదు...

    'ఉత్తమ విలన్‌' పెద్ద స్పాన్‌ ఉన్న కథ. ఇలాంటి కథకి దర్శకత్వం వహిస్తూ, నటించడం కష్టమనిపించింది. మేకప్‌ కోసమే కొన్ని గంటలు కేటాయించాలి. అలాంటప్పుడు అన్ని రంగాల్నీ సమన్వయం చేసుకోవడం కుదరదు.

    బాలచందర్‌ నటించిన సన్నివేశాలకు మీరే దర్శకత్వం వహించారట..

    బాలచందర్‌ నటించిన సన్నివేశాలకు మీరే దర్శకత్వం వహించారట..

    (నవ్వుతూ) ఆ సన్నివేశాలకు నేనేంటి? నా టీమ్‌లో ఉన్నవాళ్లంతా దర్శకులే. ఎందుకంటే ఆయనే.. ఓ దర్శక దిగ్గజం. ఆయనకు మనం ఏం చెబుతాం. తొలిరోజు నాకు బాగా గుర్తు. కేబీగారు సెట్‌కి వచ్చి అప్పటికే గంట గడిచింది. మేం అటూ ఇటూ తిరుగుతూ హడావుడి చేస్తున్నాం తప్ప.. ఆయనకు ఏం చెప్పడం లేదు.

    కమల్ కంటిన్యూ చేస్తూ...

    కమల్ కంటిన్యూ చేస్తూ...

    'షూటింగ్‌ మొదలెట్టరా..' అని నవ్వుతూ అడిగారు. 'అదే ఆలోచిస్తున్నాం సార్‌... ఏం చెప్పాలో తెలుసు, కానీ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు..' అన్నా. 'ముహూర్తం కుదరాలా..' అంటూ నవ్వేశారు. ఆ నవ్వు ధైర్యం ఇచ్చింది. 'రండి సార్‌...ఇలా నిలబడండి.. షూటింగ్‌ మొదలెట్టేస్తా..' అంటూ పనిలో పడిపోయాం. ఆ తరవాత చకచక సాగిపోయింది.

    అలాగే...

    అలాగే...

    'ఈ సినిమాలో నన్నెందుకు పెట్టుకొన్నావ్‌. నేను మధ్యలో పోతే.. సినిమా ఆగిపోతుంది' అన్నారోసారి. 'అదే జరిగితే కథ మార్చి రాసుకొంటా సార్‌..' అని సమాధానమిచ్చాను. జీవితంలో నాకెన్నో ఇచ్చారాయన. ఆ మాటకొస్తే ఈ జీవితమే ఆయనది. ఓ తండ్రిలా పోతూ పోతూ.. 'ఉత్తమ విలన్‌' చిత్రాన్ని ఓ ఆస్తిలా నా చేతిలో పెట్టి వెళ్లిపోయారు.

    రీసెర్చ్ చేస్తారు..ఇప్పుడు కూడా ఇంత కష్టపడాలంటారా?

    రీసెర్చ్ చేస్తారు..ఇప్పుడు కూడా ఇంత కష్టపడాలంటారా?

    డబ్బు తీసుకొంటున్నాం. సినిమా కోసం కోట్లు ఖర్చుపెడుతున్నాం. ఇంత చేశాక.. 'అదేంటి? మొన్నొచ్చిన సినిమా కూడా ఇలానే ఉంది కదా..' అని అనిపించుకోవాలా? అది నాకూ మంచిది కాదు, సినిమాకీ మంచిది కాదు. 'ఇందులో ఏదో ఓ కొత్తదనం చూపించా' అని నేనూ నా టీమ్‌ పొగరుతో కాకపోయినా ధైర్యంగా చెప్పుకోవాలి కదా.?

    మంచిది కాదు...

    మంచిది కాదు...

    ఎస్వీ రంగారావులాంటి ఒక నటుడు మళ్లీ రారు.. ఉండరు.. అంటుంటారు. నిజంగా అది నిజం. ఆయన మహోన్నతమైన నటుడు. కానీ ఆయన లాంటి నటుడు మళ్లీ రాడు అంటే మనసు చివుక్కుమంటుంది. 'రాడు..' అనడం ఆశీర్వాదం కాదు. శాపం. అలాంటి ఎస్వీరంగారావులు వెయ్యిమంది రావాలి.. అది మా హక్కు.

    యజ్ఞం చేశారు

    యజ్ఞం చేశారు

    నగేష్‌ లాంటి మంచి నటుడ్ని మళ్లీ సృష్టించాలన్న ఆశతో, ఆశయంతో బాలచందర్‌ సార్‌ యజ్ఞం చేశారు. 'ఓ కమల్‌ని పట్టుకుందాం.. ఓ రజనీని పట్టుకుందాం.. చూద్దాం.. వీళ్లలో ఎవడు నగేష్‌ అవుతాడో' అనుకొన్నారు. అలానే మేం తయారయ్యాం. నాలాంటి వాళ్లు ఇంకా వందమంది పుట్టాలి.. అప్పుడే సినిమాకి మంచిది

    మీకు స్ఫూర్తినిచ్చినవాళ్లెవరు?

    మీకు స్ఫూర్తినిచ్చినవాళ్లెవరు?

    ఎన్టీఆర్‌ గారు, ఏఎన్నార్‌ గారు.. ఎస్వీఆర్‌ వీళ్లంతా నాకు స్ఫూర్తే. ఓ రోజు ఎన్టీఆర్‌ గారు చెన్నై నుంచి హైదరాబాద్‌ షూటింగ్‌కి కృష్ణుడి గెటప్‌లో వచ్చారు. సరాసరి షూటింగ్‌కి వెళ్లిపోయారు. 'నన్ను ఈ గెటప్‌లో చూసి ఎవరేమనుకొంటారో' అనుకొంటే ఎలా? మేకప్‌ కోసం ఖర్చుపెట్టే సమయాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశం ఆయనది. అసలు ఇలా ఆలోచించేవాళ్లు ఎవరున్నారు? ఈ ఆలోచన ఇప్పటి వరకూ ఏ నటుడికీ రాలేదు. వరల్డ్‌ రికార్డులూ, గిన్నీస్‌ రికార్డులూ ఇవ్వాలంటే ఇలాంటి ఆలోచనలకూ ఇవ్వాలి.

    మరోసారి...

    మరోసారి...

    ఊటిలో షూటింగ్‌ జరుగుతోంది. తెల్లవారుజామున నాలుగున్నరకు లేవాల్సి వచ్చింది. లేచి రెడీ అవుతున్నా... పక్క రూమ్‌ నుంచి శబ్దాలొస్తున్నాయి. వెళ్లి తలుపు కొడితే... లోపల ఎన్టీఆర్‌ గారు. ఆయన 'అడవి రాముడు' షూటింగ్‌ కోసం అక్కడికి వచ్చారు. ఆ సమయంలో వ్యాయామం చేస్తున్నారు. నేను అవసరం అనుకొంటే తప్ప తెల్లవారుజామున లేవను. ఎన్టీఆర్‌ గారు అలా కాదు. అది ఆయన దిన చర్య. 'మీరు ఎక్సర్‌ సైజ్‌ చేసి ఫిట్‌గా ఉండండి...' అంటూ రాఘవేంద్రరావుగారు ఎన్టీఆర్‌కి సలహా ఇవ్వలేదు. కానీ ఎన్టీఆర్‌గారి క్రమశిక్షణ, నిబద్ధత అలాంటివి. ఇవన్నీ చూస్తూ పెరిగినవాడ్ని నేర్చుకోకపోతే ఎలా?

    కసరత్తు వెనుక కారణాలు...

    కసరత్తు వెనుక కారణాలు...

    మన దేశంలో అంత విషయం ఉంది. మనమే సరిగా వాటిని తెరపై చూపించలేకపోతున్నాం అనిపిస్తోంది. హాలీవుడ్‌ వాళ్లకు ఇవన్నీ ఎక్కడివి? వాళ్లూ మన నుంచే స్ఫూర్తి పొందుతున్నారు. 'ఉత్తమ విలన్‌'లోని ఓ పోస్టర్‌ చూసి 'ఫ్రెంచ్‌ స్త్టెల్‌ కదా..' అని అడిగారొకరు. ఆ మేకప్‌ మనది. మనదే ఫ్రెంచ్‌వాడు కాపీ కొట్టాడు. ఇది నా దేశం.. వాడు పరాయివాడు. ఇక్కడి కొచ్చి మనవన్నీ కాపీ కొట్టుకొని పట్టుకెళ్లిపోతున్నాడు. ఈ విషయం ఎవ్వరూ అర్థం చేసుకోరు.

    హలీవుడ్‌ చిత్రాలని స్ఫూర్తిగా తీసుకున్నారు కదా..?

    హలీవుడ్‌ చిత్రాలని స్ఫూర్తిగా తీసుకున్నారు కదా..?

    మన కథల్ని అక్కడ వాళ్లూ కాపీ కొడుతున్నారండీ. వాటి గురించి ఎవ్వరూ పట్టించుకోరేం. మీకో కథ చెబుతా. శ్రద్ధగా వినండి. ఓ అమాయకుడు. ఏది మంచో, ఏది చెడో తెలీదు. కానీ ఏం చేసినా అందులో నిజాయతీ ఉంటుంది. బామ్మ దగ్గర పెరుగుతాడు. తరవాత పెళ్లయి, ఓ బిడ్డకు తల్త్లెన అమ్మాయిని పెళ్లి చేసుకొంటాడు. ఈ కథ చెప్పగానే మీకు 'స్వాతి ముత్యం' గుర్తొస్తుందా? ఇదే కథ హలీవుడ్‌లో చెప్పండి వాళ్లు 'ఫారెస్ట్‌ గంప్‌' అంటారు. 'స్వాతి ముత్యం' వచ్చిన ఐదారేళ్లకు హాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమా ఇది. మనం వాళ్లపై కేసు వేయాలి (నవ్వుతూ).

    సి.కల్యాణ్‌ మాట్లాడుతూ....

    సి.కల్యాణ్‌ మాట్లాడుతూ....

    ‘‘కమల్‌హాసన్‌గారి సినిమాకు నిర్మాతను కావాలనే కోరిక తీరింది. బాలచందర్‌గారి చివరి సినిమా ఇదే కావడం కాకతాళీయం. ఆయన పై నుంచి నాకు ఇచ్చిన గిఫ్ట్‌ ఈ సినిమా అని భావిస్తాను. ‘ఉత్తమవిలన్‌' గురించి కుమార్‌బాబు చెప్పగానే ఒప్పుకున్నాను'' అని అన్నారు.

    రమేశ్‌ అరవింద్‌ మాట్లాడుతూ....

    రమేశ్‌ అరవింద్‌ మాట్లాడుతూ....

    ‘‘ఇందులో రెండు కథలుంటాయి. ఒకటి ఎనిమిదో శతాబ్దానికి చెందినది. మరొకటి 21వ సెంచరీకి చెందింది. హీరో ఒకదానిలో నృత్యకారుడిగా, మరోదానిలో సూపర్‌స్టార్‌గా కనిపిస్తారు. ఒకదాన్లో కామెడీ, మరోదాన్లో ఫ్యామిలీ అంశాలు ప్రధానంగా ఉంటాయి. బాలచందర్‌గారు, కె.విశ్వనాథ్‌గారు ఇందులో నటించారు. ఐదుగురు నాయికలుంటారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేశారు'' అని తెలిపారు.


    అలాగే... ‘‘ఇందులో బ్లెడీ ఫైట్స్‌, కారు పల్టీలు లేవు. కానీ సినిమా చూసినంత సేపు ప్రేక్షకుడి మనసు మాత్రం పల్టీలు కొడుతుంటుంది. ఈ సినిమాకు అన్నీ హంగులూ కుదిరాయి. బాలచందర్‌గారిని సంప్రదించినప్పుడు ‘మధ్యలో నేను చనిపోతే ఏం చేస్తావు?' అని అడిగారు. సినిమాకు డబ్బింగ్‌ చెప్పిన ఆయన ‘యంగ్‌ బాలచందర్‌ సినిమాను చూసినట్టుంది' అని కితాబిచ్చారు.

    కె.విశ్వనాథ్‌గారు కీలక పాత్ర చేశారు. బాలచందర్‌గారు నా కోసం 36 సినిమాలు రాస్తే, నేను ఆయన కోసం ఒక్క స్ర్కీన్‌ప్లే రాశాను. రమేశ్‌ అరవింద్‌, నేనూ బాలచందర్‌గారి శిష్యులం. నేను మా నాన్నతో గడిపిన సమయం కన్నా బాలచందర్‌గారితో గడిపిన రోజులే ఎక్కువ. ఈ చిత్రానికి జిబ్రాన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. ఈ నెల 28న పాటల్ని విడుదల చేస్తాం. ఎమోషనల్‌ సినిమా ఇది'' అని కమల్ హాసన్ అన్నారు.

    English summary
    Kamal Haasan Kamal said, 'There are neither bloody fights in the film, nor unnecessary car flipping over scenes. Yet the film makes for good watch and it's complete commercial entertainer. It boasts finest work. Both director Ramesh and me are not just good friends but we both came from same school - K Balachander's school.'
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X