తెరకెక్కిన కమల్ హాసన్ -శ్రీ విద్య ప్రేమాయణం

By Staff

Thirkatha
1970 ప్రాంతంలో పాపులర్ అయిన శ్రీ విధ్య- కమలా హాసన్ ప్రేమాయణం ఇన్నాళ్ళకు మళ్ళీ అంతటా చర్చనీయాంశంగా మారింది. ఓనం పండుగ సందర్భంగా కేరళలలో ఈ నెల 12 న రిలీజైన Thirakatha చిత్రంలో వీరి రొమాన్స్ ని ఉన్నదున్నట్లు చిత్రీకరించమే దీనికి కారణం. దాంతో ఈ చిత్రం భాక్సాఫీసు వద్ద పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కమల్ పాత్రను మళయాల నటుడు పృద్విరాజు చేయగా, శ్రీవిద్య పాత్రను ప్రియమణి చేసింది. 150 కి పైగా తమిళ,మళయాళ,తెలుగు చిత్రాలు చేసిన శ్రీవిద్యకు ట్రాజెడీ క్వీన్ అన్న పేరు ఉండేది. ఆమె 2006లో ఒంటరిగా తిరువనంతపురం లో మరణించింది. రెండేళ్ళ అనంతరం ఆమె జీవితాన్ని దగ్గరనుండి చూచిన రంజిత్ అనే దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.

ఆమె జీవితంలో లోటు పాట్లను ,కమల్ తో ప్రేమ మొదలైన వైనాన్ని ఈ చిత్రంలో చెప్పటానికి ప్రయత్నించారుట. అలాగే ఈ చిత్రం ప్రమోషనల్ పోస్టర్స్ లో ఆమె ఫొటో వేసి మరీ పబ్లిసిటీ చేస్తున్నారుట. అలాగే ఈ దర్శకుడు ఓ టెలివిజన్ ఇంటర్వూలో మాట్లాడుతూ తాను శ్రీవిద్య జీవితాన్ని అనుసరించే కొన్ని సన్నివేశాలు అల్లుకున్నా పరిశ్రమలో పెద్ద హీరోల,హీరోయిన్స్ ప్రేమాయణాలు చాలా కాలంగా గమినిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించానంటున్నారు. అయితే కేరళ పరిశ్రమలో చెప్పుకునేది ఏంటంటే రంజిత్ ..శ్రీవిధ్య డైరీలను తీసుకుని ఈ సినిమా రూపొందించాడంటున్నారు.

రంజిత్ పై శ్రీవిద్యకు పూర్తి నమ్మకం ఉండేదని అందుకే బయోగ్రఫి రాయించే నిమిత్తం ఆ డైరీలు ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. అలాగే ప్రియమణి..మాళవిక అనే పాత్రలో శ్రీవిద్యను అనుకరిస్తూ ...మేనరిజమ్స్ చూపుతూ అమోఘమైన నటన చూపిందనేది సమాచారం. అనూప్ మీనన్ ...అనే నటుడు కమల్ గా నటించాడు . పృధ్వీరాజ్ దర్శకుడుగా వీరి అనుబంధాన్ని దగ్గరనుంచి గమనించే వ్యక్తిగా అంటే రంజిత్ గా కనిపిస్తాడు. ఇక ఈ సినిమా టైటిల్ అయిన Thirakatha అంటే స్క్రీన్ ప్లే అని అర్ధం. స్క్రీన్ వెనక నడిచే ఈ ప్లే ని చక్కని స్క్రీన్ ప్లే తో ముడిపెట్టడమే ఈ సినిమా ఫ్లస్ లలో ఒకటి అని విశ్లేషకులు చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X