కమల్ మగధీర టైటిల్ మార్పు!
హోంపేజి సినిమా అవీ ఇవీ
కమల్ హసన్ ప్రతిష్టాత్మక చిత్రం మగధీర టైటిల్‌ను మార్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు వేటాడు, వెంటాడు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. జ్యోతిక, కమలినీ ముఖర్జీ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కమల్ హసన్ నిజాయితీపరుడైన పోలీసు అధికారిగా కనిపిస్తారు. గౌతమ్ మీనన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంగీతం హారిస్ జైరాజ్ సమకూర్చారు. షూటింగ్, ఇతర పనులు పూర్తయ్యాయి. వైవిధ్యమైన పాత్రలు ఇష్టపడే కమల్ హసన్ ఈ సినిమా దర్శకుడు గౌతమ్ మీనన్‌ను తెగ పొగిడేస్తున్నారు. తెర మీద ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా ఆడియో త్వరలో విడుదల కానుంది. సినిమా మార్చి నెలాఖరులో విడుదల అవుతుంది.


Click it and Unblock the Notifications