twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    By Srikanya
    |

    హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ తాజా చిత్రం 'విశ్వరూపం' ఆడియో సిని ప్రముఖుల సమక్షంలో ఆదివారం విడుదలైంది. కమల్‌ హాసన్‌ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం'. పూజ, ఆండ్రియా హీరోయిన్స్. శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ స్వరాలు సమకూర్చారు.

    సినిమాని డీటీహెచ్‌లో విడుదల చేస్తూ కొత్త యుగంలోకి అడుగు పెడుతున్నాము''అన్నారు కమల్ హాసన్. ఈ చిత్రం డైరక్ట్ డిటిహెచ్ తో విడుదల అవుతోంది. ప్రారంభంలో టాటాస్కైతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే పబ్‌, షాపింగ్‌మాల్స్‌ వంటి ప్రాంతాల్లో సినిమా కనెక్షన్‌కు అవకాశం ఇవ్వకూడదని కమల్‌ షరతు పెట్టారు. వారు అంగీకరించకపోవడంతో సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారు. ఆఖరకు ఎయిర్‌టెల్‌, వీడియోకాన్‌, డిష్‌టీవీలు కమల్‌ పెట్టిన షరతుకు అంగీకరించిన తర్వాత శనివారం రాత్రి టాటాస్కై కూడా సరేనని తెలిపింది. చెన్నై కేంద్రంగా ఉన్న 'సన్‌ డీటీహెచ్‌' కూడా తాజాగా ఈ జాబితాలోకి వచ్చింది.

    డీటీహెచ్‌ విడుదలకు ఆంధ్రలో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోందని అందరూ అనుకుంటున్నారు. వాస్తవానికి అక్కడ థియేటర్లు కూడా బుక్కైపోయాయి. ఇక విడుదలే ఆలస్యం. మనం కాలానికి తగ్గట్టు మారుతుండాలి. ఉపహగ్రహ హక్కుల విధానం వచ్చినప్పుడు అందరూ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఫిల్మ్‌ నుంచి డిజిటల్‌కు మారాయి. 'అరె.. ల్యాబ్‌లు ఏమైపోవాలి' అని బాధపడ్డారు. ల్యాబ్‌లను దృష్టిలో పెట్టుకుంటే కాలంతో పాటు మనం పయనించగలమా? ఎన్ని అవకాశాలు ఉన్నా చూసేవారు థియేటర్‌కు వచ్చే వీక్షిస్తారు. అందులో సందేహం లేదు అని సిని ప్రముఖులు అన్నారు.

    ఇక ఈ ఆడియో విడుదల ఫోటోలు మీకోసం...

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    'విశ్వరూపం' తెలుగు అనువాద చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో నోవాటెల్‌ హోటల్‌లో జరిగింది. ఆడియో సిడీని విడుదల చేసిన దాసరి నారాయణరావు తొలి సిడీని డి.రామానాయుడుకు అందించారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    రామానాయుడు మాట్లాడుతూ ''కమల్‌తో నేను నిర్మించిన 'ఇంద్రుడు చంద్రుడు' చిత్రాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. తనకి షూటింగ్‌ లేకపోయినా సరే... సెట్‌కి వచ్చి విలువైన సలహాలిచ్చేవాడు. విశ్వరూపం ప్రచార చిత్రం చాలా బాగుంది. సాంకేతికంగా ఈ సినిమా ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది''అన్నారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    ఎస్‌.ఎస్‌.రాజమౌళి మాట్లాడుతూ ''కనీసం ఊహించడానికి కూడా సాహసం చేయలేని ఎన్నో ప్రయోగాలు కమల్‌హాసన్‌ చేశారు. ఆయన ఆలోచనలు ఎంత గొప్పవో ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. పైరసీని ఎలా అరికట్టాలో తెలియక ఎన్నో సంవత్సరాల నుంచి చిత్ర పరిశ్రమ ఇబ్బందులుపడుతోంది. 'విశ్వరూపం' తరహాలో సినిమాల్ని డీటీహెచ్‌లో విడుదల చెయ్యడం ఒక మంచి పరిష్కారంగా కనబడుతోంది''అన్నారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    దాసరి నారాయణరావు ప్రసంగిస్తూ ''ఈ సినిమాని డీటీహెచ్‌లో విడుదల చేస్తూ ఏటికి ఎదురీదుతున్నాడు కమల్‌. ఈ విధానాన్ని నేను సమర్థిస్తున్నాను. ప్రగతిని ఆపడానికి మనం ఎవరం? ఇదొక విప్లవం. రావాల్సిందే. పైరసీ సీడీల్ని బఠానీల్లా అమ్మేస్తున్న ఈ రోజుల్లో నిర్మాతల్ని కాపాడటానికి ఇదొక మార్గం. యుద్ధంలో మొదట వెళుతున్న సైనికుడికి దెబ్బలు తగులుతాయి. డీటీహెచ్‌ విషయంలో మొదటి సైనికుడు కమల్‌హాసన్‌. పరిశ్రమకు కూడా ఈ విధానం చాలా మంచిది. ప్రతి పెద్ద హీరో సినిమా డీటీహెచ్‌లో విడుదల చేసే సౌలభ్యం ఉంటే నిర్మాతకు లాభాలు చేకూరుతాయి. ఇందులోనే భవిష్యత్తుంది. మార్కెట్‌ పెంచుకోవాలంటే ఇలాంటివి తప్పవు'' అన్నారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    కమల్‌ హాసన్‌ మాట్లాడుతూ ''దాసరి పేరు మొదటిసారి నేను బాలచందర్‌ నోటి నుంచి విన్నాను. చూడకుండానే ఆయనకి నేను అభిమానినైపోయాను. దాసరితో చేసిన 'యాద్‌గార్‌' సినిమా ఎప్పటికీ మరిచిపోలేను. స్క్రిప్ట్‌ కంఠతా పట్టిన ఒకే ఒక్క నిర్మాత రామానాయుడు. నాకు నడక నేర్పించిన గురువు బాలచందర్‌. ఆయన్ని నాన్న అని పిలవాలో, అమ్మ అనాలో తెలియని పరిస్థితి. నేను నేర్చుకొన్నదంతా గొప్పవాళ్ల దగ్గర్నుంచే. అందుకే తప్పటడుగు వెయ్యనని అనిపిస్తోంది. డీటీహెచ్‌లో సినిమాని విడుదల చేసినా... థియేటర్లే ప్రధానం. ఇంట్లో వెంకటేశ్వరస్వామి క్యాలెండర్‌ ఉన్నంత మాత్రాన తిరుపతికి వెళ్లే భక్తుల సంఖ్య తగ్గిపోదు. చిత్ర పరిశ్రమలకు ఆలయం సినిమా హాలే. ఎంత డీటీహెచ్‌లో సినిమాని విడుదల చేసినా థియేటర్‌లో చూస్తే వచ్చే ఆనందమే వేరు'' అన్నారు. ఈ కార్యక్రమంలో హరీష్‌శంకర్‌, సంతోష్‌ శ్రీనివాస్‌, పూజ తదితరులు పాల్గొన్నారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    ఆడియో వేడుకలో హీరోయిన్‌ పూజా కుమార్‌ మాట్లాడుతూ చిత్ర విజయం ఆకాంక్షించారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    హీరో కమల్‌ హాసన్‌, హీరోయిన్‌ పూజా కుమార్‌, ప్రముఖ నిర్మాత డి.రామానాయుడు, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణరావు, ఎస్‌.ఎస్‌.రాజమౌళి, హరీష్‌ శంకర్‌, తదితరులు ఆడియో విడుదల కార్యక్రమానికి హాజరయ్యారు.

    రాజమౌళి, దాసరి గెస్ట్ లగా 'విశ్వరూపం' ఆడియో (ఫోటోలతో...)

    కమల్‌ హాసన్‌, పూజా కుమార్‌, ఆండ్రియా జెరెమియా ప్రధాన తారాగణంగా పి.వి.ఆర్‌.సినిమాతో కలిసి కమల్‌ హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తమిళ, హిందీ, తెలుగు భాషలలో 'విశ్వరూపం' చిత్రాన్ని నిర్మించారు.

    English summary
    Vishwaroopam is an upcoming bilingual Indian spy thriller film written, directed and co-produced by Kamal Hassan that features himself in the lead role. The film audio released at Hyderabad. The film, also has Pooja Kumar, Rahul Bose, Andrea Jeremiah and Jaideep Ahlawat in supporting roles. The soundtrack is composed by Shankar-Ehsaan-Loy . The film was shot with the same cast in both languages simultaneously, and is titled in Hindi as Vishwaroop.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X