కమల్ 'విశ్వరూపం' కోసం కేన్స్ రూల్స్ ఛేంజ్
కమల్ హాసన్ ఏది చేసినా సంచలనమే. తాజాగా కమల్‌హాసన్ స్వీయ నిర్మాణంలో తనే ప్రధానపాత్రలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'విశ్వరూపం'. తమిళం, హిందీల్లో ఒకేసారి నిర్మితమవుతోంది. ఈ సినిమా ప్రస్తుతం డబ్బింగ్ దశలో ఉంది. 'విశ్వరూపం' సినిమాను కేన్స్ చిత్రోత్సవానికి పంపాలని కమల్ హాసన్ శ్రమిస్తున్నారు. ఇందుకోసం రేయింబవళ్లు ఆయన కష్టపడుతున్నారు. కేన్స్ చిత్రోత్సవాలకు పంపాలంటే ఈపాటికే సినిమాను పంపి ఉండాలి. కాకపోతే కమల్ కోసం మరో 15 రోజులు సమయం పొడిగించినట్లు తెలుస్తోంది. మార్చి 15లోపు పూర్తి చేసిన సినిమా కాపీని పంపాలని కేన్స్ ప్రతినిధులు కమల్‌కి తెలిపినట్లు సమాచారం. అందుకే వీలైనంత తొందరగా చిత్రాన్ని పూర్తి చేయాలని కమల్ బృందం అనుకుంటోంది. తొమ్మిది మంది కేన్స్ జ్యూరీ సభ్యులు ఈ సినిమా చూసిన తరవాత అక్కడ ప్రదర్శించేదీ లేనిదీ తెలుస్తుంది. మే 16 నుంచి కేన్స్ చిత్రోత్సవం ప్రారంభమవుతుంది. 12 రోజులపాటు కొనసాగుతుంది.
ఇక కమల్ హాసన్ ప్రతిష్టాత్మకంగా రూపొందించబోతున్న చిత్రం విశ్వరూపం. కమల్ తానే హీరోగా చేస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ హీరో రాహల్ బోస్ ని విలన్ గా ఎంపిక చేసారు. సమీరా రెడ్డిని హీరోయిన్ గా ఎంపిక చేసిన ఈ చిత్రం షూటింగ్ ఏకధాటిగా ఒకే షెడ్యూల్ లో డబ్బై ఐదు రోజులు పాటు అమెరికాలో జరిగింది. అలాగే తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాలీవుడ్ చిత్రం మిషన్ ఇంపాజిబుల్ తరహాలో స్పై ధ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కనుందని తెలుస్తోంది. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై రూపొందే ఈ చిత్రానికి దాదాపు నూటయాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి కమల్ రెడీ అవుతున్నారు. ఇదే ఇండియాలో హైయిస్ట్ బడ్జెట్ సినిమా అని చెప్తున్నారు. ఇందులో కమల్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించటానికే ఈ టైటిల్ పెట్టాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











