కమల్ 'విశ్వరూపం' రిలీజ్ డేట్ (అఫీషియల్)

By Srikanya

హైదరాబాద్: కమల్‌ హాసన్‌ తాజా చిత్రం 'విశ్వరూపం' రిలీజ్ ఎప్పుడెప్పుడా అని ఆయన అభిమానలు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో చిత్రాన్ని సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ప్రకటించారు. జనవరి 11న చిత్రాన్ని తెరపైకి తీసుకొస్తారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పాటల్ని విడుదల చేస్తారు.

కమల్ దర్శకత్వం వహిస్తూ నటించిన చిత్రమిది. పూజాకుమార్‌, ఆండ్రియా హీరోయిన్స్. అంతర్జాతీయ ఉగ్రవాదం నేపథ్యంగా సాగే కథాంశంతో 'విశ్వరూపం' రూపుదిద్దుకొంది. దీంట్లో కమల్‌ కథక్‌ నృత్యకళాకారుడిగా కనిపిస్తారు. ఆయనకీ ఉగ్రవాద ముఠాలకీ సంబంధం ఏమిటన్నది సస్పెన్స్‌. ఈ సినిమాను ఆరో త్రీడీ అనే సాంకేతిక పరిజ్ఞానంతో తీర్చిదిద్దారు.

చిత్రం గురించి కమల్ మాట్లాడుతూ... ''విశ్వరూపం చిత్రాన్ని ఏ మతానికీ, దేశానికీ వ్యతిరేకంగా రూపొందించలేదు. నేను గాంధేయవాదిని'' అని చెప్పారు కమల్‌ హాసన్‌. ఆయన నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం 'విశ్వరూపం'. ఈ సినిమాకి సంబంధించిన ప్రచార చిత్రాన్ని చెన్నైలో విడుదల చేశారు. దీన్ని ఆరో త్రీడీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ సందర్భంగా కమల్‌ మాట్లాడుతూ ''ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్‌ వచ్చింది. దీంట్లో తీవ్రవాదానికి సంబంధించిన కారణాలు, విరుగుడును ప్రస్తావించాను. హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిస్తున్నందున విడుదల తేదీని ఖరారు చేయలేకపోతున్నాను'' అన్నారు.

తీవ్రవాదానికి పరిష్కారం చెప్పారా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ ''అందుకు విరుగుడుగా వారి చేతికి దువ్వెనిచ్చా. ఎలా దువ్వుకుంటారన్నది వారిష్టం అన్నారు. రాహుల్‌ బోస్‌, జైదీప్‌ అహ్లావత్‌, నాజర్‌, జరీనా వహాబ్‌ తదితరులు నటించారు. ప్రముఖ దర్శకుడు శేఖర్‌కపూర్‌ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాకి సంగీతం: శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌, కెమెరా: సాను వర్గీస్‌, నిర్మాతలు: ప్రసాద్‌ వి.పొట్లూరి, చంద్రహాసన్‌, కమల్‌ హాసన్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X