twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జల్లికట్టు క్రీడనే, జంతువులను హింసించడం కాదు: కమల్ హాసన్

    By Pratap
    |

    చెన్నై: జల్లికట్టు ఓ ఆటే అన్నారు కమల్ హాసన్. దున్నపోతుల క్రీడకు ఫిల్మ్ స్టార్ బాసటగా నిలిచారు. జంతువును హింసించడం ఆ ఆట ఉద్దేశం కాదన్నారు. జల్లికట్టు అంటే ఎద్దుల్ని ఆట పట్టించడం తప్ప..దాన్ని భౌతికంగా ఇబ్బంది పెట్టడం కాదని కమల్ హాసన్ ఆ క్రీడపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

    చెన్నైలో జెల్లికట్టుపై ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించిన తర్వాత కమల్ ఈ వ్యాఖ్యలు చేశారు. స్పెయిన్, ఇటలీ దేశాల్లో బుల్ గేమ్ వల్ల జంతువులకు హాని జరిగే అవకాశం ఉంది. కానీ మన దేశంలో ఆ పరిస్థితి లేదని కమల్ అన్నారు.

    Kamala Hassan appeals to give permission to Jallikattu

    ఈ ఆట ద్వారా ఓ వ్యక్తి శారీరక సామర్థ్యాన్ని అంచనా వేయవచ్చునని చెప్పారు. సంక్రాతి సమయంలో తమిళనాడులో జెల్లికట్టును ఆడుతారు. అయితే ప్రస్తుతం ఈ ఆటపై సుప్రీంకోర్టు నిషేధం విధించింది. జల్లికట్టు ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కమల్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

    కోడెలపై చిన్న చారిక పడినా క్రీడ నుంచి బయటకు పంపించేస్తారని ఆయన చెప్పారు. దీన్ని జల్లికట్టు అని పిలుస్తున్నప్పటికీ తమిళంలో దీన్ని ఐరు వఝుధాల్ అని పిలిచేవారని ఆయన చెప్పాపుర. ఇది సంప్రదాయబద్దమైన ఆట అని ఆయన చెప్పారు.

    English summary
    With festival of harvest Pongal round the corner in Tamil Nadu and demands pouring in from several groups to lift the ban on jallikattu (taming of bulls), actor Kamal Haasan also raised his voice in support of the valorous sport.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X